హైదరాబాద్ జూన్ 28
సెకండియర్ పరీక్షలు రద్దు కావడంతో ఏ ప్రాతిపదికన ఫలితాలు ఇవ్వాలన్న దానిపై ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింన ప్రభుత్వం ఫస్టియర్ ఫలితాల ఆధారంగా సెకండియర్ ఫలితాలను రూపొందించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాల విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఫస్టియర్‌లో వచ్చిన మార్కులే సెకండియర్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది ప్రాక్టికల్స్‌లో100 శాతం మార్కులు ఇవ్వనుంది. బ్యాక్‌లాగ్స్ ఉంటే 35శాతం మార్కులతో పాస్ చేయనుంది. ప్రైవేట్‌గా పరీక్ష రాసే విద్యార్థులకు 35శాతం పాస్ మార్కులు ఇవ్వనున్నారు. ఈ క్రైటీరియా నచ్చని విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు జులై 1 నుంచి విద్యా సంస్థల ప్రారంభం, ఆన్ లైన్ తరగతుల మార్గదర్శకలపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. జులైలో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు. స్కూల్స్, జూనియర్ కాలేజీలతోపాటు డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కాలేజీల తరగతులు ఆన్ లైన్‌లోనే నిర్వహించుకునేందుకు నిర్ణయం తీసుకునే అవకాశముంది