YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వీహెచ్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి

వీహెచ్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్
హైదర్గూడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నేత వి హనమంతరావును టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం పరామర్శించారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శకు వచ్చా. ఆయన ఆరోగ్యం కుదటపడింది. హాస్పిటల్ లో ఉన్న.. ప్రజా సమస్యలపై నాతో చర్చించారు. దళితుల విషయంలో వీహెచ్ చాలా కమిటెడ్ గా ఉన్నారు. రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్ చేస్తున్న ద్రోహం పై పోరాడాలని సూచించారని అన్నారు.
ప్రపంచంలో అతి పెద్ద ద్రోహి సీఎం కేసీఆర్. పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం పెడితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని చెప్పి.. తట్టెడు మట్టి తీయలేదు. దళిత ఎంపర్ మెంట్ అని కేవలం నియోజకవర్గానికి వంద కుటుంబాలకు సహాయం అనడం ద్రోహం. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. పార్టీ అభివృద్ధి విషయంలో కొన్ని సలహాలు ఇచ్చారు.  సోనియా గాంధీ వద్దకు స్వయంగా కలిసి వెళ్దామని చెప్పారు. వీహెచ్ సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తానని వ్యాఖ్యానించారు.

Related Posts