YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ప్ర‌జ‌లంతా క‌ర్త‌వ్య‌దీక్ష‌తో ప‌న్నులు చెల్లించాలి

ప్ర‌జ‌లంతా క‌ర్త‌వ్య‌దీక్ష‌తో ప‌న్నులు చెల్లించాలి

ప్ర‌జ‌లంతా క‌ర్త‌వ్య‌దీక్ష‌తో ప‌న్నులు చెల్లించాలి నాకు నెల‌కు 5 ల‌క్ష‌ల జీతం.. 2.75 ల‌క్ష‌ల ట్యాక్స్ క‌డుతున్నా ప్ర‌భుత్వ ప్రాప‌ర్టీ న‌ష్ట‌మైంద‌న్న వాద‌నే..కానీ అది ప్ర‌జ‌లు చెల్లించే ప‌న్ను రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ పిలుపు.
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని త‌న సొంతూరికి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ రైలులో వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ తాను కూడా ఆదాయ‌ప‌న్ను క‌డుతున్న‌ట్లు చెప్పారు. అభివృద్ధి కోసం రెగ్యుల‌ర్‌గా ప‌న్నులు చెల్లించాల‌న్నారు. నెల‌లో తాను ఆదా చేసుకున్న దాని క‌న్నా ఎక్కువే కొంద‌రు సంపాదిస్తున్న‌ట్లు కూడా చెప్పారు. మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌త్యేక రైలులో యూపీ వెళ్లిన రాష్ట్ర‌ప‌తి కోవింద్.. స్వ‌గ్రామం ప‌రౌంక్ గ్రామంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ప్ర‌జ‌లంతా క‌ర్త‌వ్య‌దీక్‌ంతో ప‌న్నులు చెల్లించాల‌న్నారు. ప‌లానా రైల్వే స్టేష‌న్‌లో రైలు ఆగ‌డం లేద‌ని కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు, కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రు ఆ రైలును ధ్వంసం చేస్తారు, కొంద‌రు రైళ్ల‌కు నిప్పు అంటిస్తుంటారు, రైలు ద‌గ్ధం అయితే అప్పుడు న‌ష్టం ఎవ‌రికి జ‌రుగుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ ప్రాప‌ర్టీ న‌ష్ట‌మైంద‌న్న వాద‌న ప్ర‌జ‌లు వినిపిస్తుంటార‌ని, కానీ అది ప్ర‌జ‌ల ప‌న్ను అని కోవింద్ తెలిపారు.
ప్ర‌స్తుతం దేశంలో అత్య‌ధిక జీతం అందుకుంటున్న వ్య‌క్తి రాష్ట్ర‌ప‌తి అని అంద‌రికీ తెలుసు అని, ప్ర‌తి నెలా రూ.2.75 ల‌క్ష‌లు నెల‌కు ట్యాక్స్ క‌డుతున్నాన‌న్నారు. ప్ర‌తి నెలా 5 ల‌క్ష‌ల జీతం వ‌స్తుంద‌ని అంద‌రూ అంటుంటార‌ని, కానీ దానికి కూడా ట్యాక్స్ ఉంటుంద‌ని తెలుసుకోవాల‌న్నారు. రాష్ట్ర‌ప‌తి కోవింద్‌ తాను ట్యాక్స్ క‌డుతున్న‌ట్లు చెప్ప‌గానే అక్క‌డ ఉన్న ప్ర‌జ‌లంతా చ‌ప్ప‌ట్లు కొట్టారు. తాను ఆదా చేసిన దాని క‌న్నా.. అధికారులు ఎక్కువ సంపాదిస్తార‌ని, ఇక్క‌డ ఉన్న టీచ‌ర్లు అంత క‌న్నా ఎక్కువ సంపాదిస్తున్నార‌న్నారు. ప‌న్నులు చెల్లించ‌డం వ‌ల్ల అభివృద్ధి జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని చెప్పేందుకు తాను ఇలా మాట్లాడుతున్న‌ట్లు రామ్‌నాథ్ తెలిపారు. సాధార‌ణ ప‌ల్లె పౌరుడు ఇలా దేశ అత్యున్న‌త ప‌ద‌విని అల‌క‌రిస్తార‌ని తానెప్పుడు అనుకోలేద‌ని, కానీ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు.

Related Posts