YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దూకుడు పెంచిన పవన్

దూకుడు పెంచిన పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ తాజాగా ప్రకటన చేశారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా దూకుడు పెంచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గత నాలుగు రోజులుగా పార్టీ కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్ ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.  పార్టీ బలోపేతం, ప్రత్యేక హోదా, విభజన హామీలతో పాటూ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో తాము పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే పవన్ కల్యాణ్ ఈ ప్రకటనతో వామపక్షాల సంగతేంటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. పవన్ కల్యాణ్ తన ప్రకటనలో మాత్రం 175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పారు. కాని జనసేన వర్గాలు మాత్రం పవన్ కల్యాణ్ వామపక్షాలతో పొత్తు కుదుర్చుకునే అవకాశముందని చెబుతున్నారు. జనసేన కూటమి అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పడమే ఆయన ఉద్దేశ్యమని జనసేన పార్టీ నేతలు చెప్పారుజనం మధ్యలోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకునేందుకు జనసేనాని ప్రయత్నాలు ప్రారంభించారు. తాను పార్ట్ టైం పొలిటీషియన్ ను కాదని, శాశ్వతంగా ప్రజల్లో ఉండేందుకు పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటానని చెప్పారు.దేవ్  పవన్ కల్యాణ్ తో కలసే ఉన్నారు. త్వరలోనే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తో కలసి ఆయన పనిచేస్తారని, వ్యూహాలను రచించేందుకు ఆయనకు 1200 మంది కార్యకర్తలను పవన్ ఇస్తున్నారు. దేవ్ వ్యూహాలతోనే పార్టీ ముందుకు వెళుతుందని పవన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని, పార్టీకి పోటీ చేసిన అనుభవం లేకపోయినా గత రెండు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం పార్టీ కార్యకర్తలకు ఉందన్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ప్రణాళిక బద్ధంగా అడుగలు వేస్తామన్నారు. త్వరలో ప్రజలకు వద్దకు వస్తానని, తన రాష్ట్ర పర్యటనపై ఈ నెల 11న రాష్ట్ర పర్యటన వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. కొద్ది రోజులుగా మౌనంగా ఉన్న పవన్ కల్యాణ్ ముఖ్యంగా ఏపీ రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది బస్సుయాత్రలా? లేక జిల్లా కేంద్రాల్లో సభలు నిర్వహించడమా? అన్నది తేలాల్సి ఉంది. తెలంగాణలో పోటీచేసే విషయంపై మాత్రం పవన్ ఇంకా క్లారిటీ లేదు. ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీలో పొత్తు పెట్టుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ కూడా పవన్ సాయం కోరుకుంటున్నారు. అందుకే తెలంగాణలో పోటీ చేసే విషయం ఆగస్టులో చెబుతానని పవన్ తెలిపారు.

Related Posts