YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

జ్వర హరేశ్వరుడు

జ్వర హరేశ్వరుడు
 

మానవునికి కావలసినవి ఆయువు, ఆరోగ్యం  సౌఖ్యం  అని నారాయణ భట్టాద్రి  నారాయణీయంలో భగవంతుని  ప్రార్ధించారు.  ఆయుర్దాయం ఎక్కువగా వున్నవారికి ఆరోగ్యం వుండదు. ఆరోగ్యంగా వున్నా అనేకమందికి ఐశ్వర్యం వుండదు. ఆయువు ఎక్కువగా వున్న వారికి ఐశ్వర్యం, ఆరోగ్యం వుండవు. ఇవి మూడు కలిగినవారే భాగ్యశాలురు. ఆరోగ్యం దేహానికి సంబంధించి నది.వాతావరణానికి సంబంధించినది. మనిషి ఆత్మను గూర్చి, దేహాన్ని గురించి మనకు ప్రాచీన గ్రంధాలెన్నో వున్నాయి. వాటిలో ఈ దేహానికి కావలసిన ఆరోగ్య లక్షణాల గురించి వివరిస్తున్నాయి. ఈ దేహానికి  ఏదైనా రుగ్మత కలిగితే అది తొలగించుకొనే విధానాలు కూడా వివరించాయి. మనిషికి వచ్చే వివిధ రకాల జ్వరాలని గురించి పురాతన గ్రంధాలలో  అనేక వివరాలు తెలుస్తున్నాయి. ఈ దేహం  పంచభౌతికమైనది. అంతిమంగా పంచ భూతాలలో కలసిపోతుంది. పంచభూతాలలో అగ్ని ముఖ్యమైనది. యాగాలలో అగ్ని ఆవిర్భాగాలను ఆయా దేవతలకు ఎలాగైతే చేరుస్తుందో, అదే విధంగా ఒక్కక్కరి దేహం లో వున్న అగ్ని  భుజించబడిన ఆహారాన్ని జీర్ణింపచేస్తుంది. వాటిలోని శక్తిని ఆయా సెల్స్ కి చేరవేస్తుంది. ఆ అగ్ని ఆరిపోయిన వారు అగ్ని జ్వాలలకి బలికావలసిందే. దీనిని దేహ ఉష్ణోగ్రత అని అంటారు. ఈ ఉష్ణోగ్రత  వాత, పిత్త, కఫ నాడుల ద్వారా సక్రమంగా  కాపాడబడుతన్నాయి. దేహంలో సమానత తక్కువైనప్పుడు అది రోగంగా మారుతున్నది. ఆ రోగానికి చిహ్నం జ్వర ఉష్ణోగ్రత. సామాన్యంగా ఉండే ఉష్ణోగ్రత  అధికంగా వుంటే జ్వరం అంటున్నాము. జ్వరం అన్నది వ్యాధి కాదు. వ్యాధులు రావడానికి సూచన. పురాతన సంస్కృత వేద గ్రంధాలలో జ్వరాలను గురించి అనేక  విశేషాలు వివరించి వున్నాయి.   అధర్వణ వేదంలో జ్వరం గురించి వివరించారు. చరకసంహితంలో రోగాలను తొలగించుకునే విధానాలను గురించి  తెలుపబడింది. వాటిలో తెలుపబడిన విషయాలు కుతూహలమైనవి. ఈనాడు మనం చూసే అనేక వ్యాధుల గుణ గణాలు   ఆ పురాతన గ్రంధాలలో కనిపిస్తాయి. యక్ష్మనుడు మానవులను జంతువులను కూడా  పీడించే అసురుడు. ఒక్కొక్క భాగంగా పట్టు కుపీడిస్తుంటాడు.  కాళ్లు చేతులు పని చేయకుండా చేస్తాడు. జ్వరం వచ్చి ఒళ్లు నెప్పులు వస్తాయి. గుండె నెప్పిని కలిగిస్తాడు. అని వివరించింది. ఇదే వేదంలో తెలుపబడిన దాక్మన్ రోగం రుద్రునికి సంబంధించినది.  తీవ్రమైన నొప్పి రుద్రుని వలన వస్తుంది. రుద్రుని లింగం  కురుపులను కలిగిస్తుంది. దాక్మన్, క్షయ రుద్రుని వలన ఆవిర్భవించినవి.  రుద్రుని కోపం వలననే జ్వరం ఏర్పడుతుందని చరక శుశ్రుత సంహితంలో తెలిపిన వివరం.  ఋగ్వేదం తెలుపతున్నట్టు,ప్రధమ వైద్యుడు కూడా  రుద్రుడే. ' వైద్యో నారాయణ హరి'  అని వైష్ణవ  ఆళ్వారులు శ్రీ హరిని కీర్తిస్తారు.  పాలకడలిని చిలికినప్పుడు  విలువైనవెన్నో ఆవిర్భవించాయి. మహావిష్ణువు అంశతో ధన్వంతరి అమృతకలశంతో  ఆవిర్భవించాడు. ధన్వంతరికి మన  ఆలయాలలో ప్రత్యేక సన్నిధులు వున్నవి.  శ్రీ రంగంలో ప్రత్యేకంగా ధన్వంతరికి సన్నిధి చాలా ప్రసిధ్ధి. శ్రీ రంగనాధుని  ప్రసాదాన్ని ధన్వంతరి పరీక్షించిన పిదపే  రంగనాధునికి నివేదించాలి. ధన్వంతరిని  ప్రార్ధిస్తే  ఆరోగ్యము లభిస్తుంది. ఇదేవిధంగా జ్వరాన్ని పోగొట్టి ఆరోగ్యం యిచ్చే పరమశివుని అంశని జ్వరేశ్వర్ అనే పేరుతో  కొన్ని ఆలయాలలో ప్రతిష్టించారు. కొన్ని ఆలయాలలో జ్వరహరేశ్వరర్ అని పిలుస్తారు. ఈసమయంలో ప్రపంచం అంతా అంటు వ్యాధి ప్రబలంగా వున్నది.  దాని ప్రధమ స్ధితి అయిన జలుబు, జ్వరం మానవాళిని పీడిస్తోంది. అనేక వందల  వత్సరాల క్రితం యీ విధమైన అనారోగ్యం మానవాళిని కుదిపివేసింది. ఒకసారి తిరుజ్ఞాన సంబందర్ తిరుచెంగొట్టి   ర్ధనారీశ్వరుని ఆలయానికి వచ్చారు.  ఆ ఆలయానికి గ్రామస్తులు ఎవరూ రావడం లేదని తెలుసుకున్నారు. ఏదో  అనారోగ్యం వలన గ్రామస్థులు అందరూ ఇళ్ళు వదలి బయటికి రావడానికి భయపడి ఇళ్ళలోనే వుండిపోయారు.  విచారణచేయగా ఊరంతా  యేదో అంటు వ్యాధి ప్రబలినదని తెలిసింది. గ్రామస్తులని చలిజ్వరం పీడిస్తున్నదని తెలియగా దానికి విరుగుడు కనిపెట్టాలని తిరుజ్ఞానసంబందర్ సంకల్పించారు. గ్రామ ప్రజలు సంబందర్ మహిమతెలుసుకుని  ఆయన పాదాలకి వందనం చేసి, తమని ఆ అంతు తెలియని జ్వరం నుండి కాపాడమని వేడుకున్నారు. గ్రామస్తుల ప్రార్ధన కి  కరుణతో తిరుజ్ఞానసంబందర్ భగవంతుని స్తుతిస్తూ వరుసగా 11 తేవార పదిక పాటలని పాడారు. గ్రామస్తులను  కూడా   శ్రధ్ధగా ఆ పదికాలను పారాయణచేయమని చెప్పారు. గ్రామస్తులు అందరు సమిష్టిగా పారాయణం చేసి చలి  జ్వరాన్ని తొలగించుకున్నారు. ఒక పెద్ద వృక్షం క్రింద జ్ఞాన సంబందర్  గ్రామస్తుల కోసం ప్రార్ధించి స్తుతించిన చోటు " జోగీ మఠం" అని పిలువబడినది.  ఆ చోటనే " జ్వరకంఠేశ్వరుడనే' దేవుని ఆలయం వున్నది. ఈనాటికి  తీవ్ర జ్వరాలతో  ధపడే వారు యీ జ్వరకంఠేశ్వరుని ప్రార్ధిస్తారు. ఆలయంలో చారు అన్నం భగవంతునికి నివేదించి దానిని ప్రసాదంగా   నియోగిస్తారు. మదురైలో గూని పాండ్యన్ అనే రాజు రాజ్యం ఏలుతున్న సమయంలో ఆ రాజుకి తీవ్రమైన జ్వరం  వచ్చింది. ఆ సమయంలో రాజు చమణ మతాన్ని అనుసరించేవాడు. చమణులు శాయశక్తులా రాజుకి జ్వరం డానికి  ప్రయత్నించారు కాని గుణమవలేదు.  ఆఖరికి తిరుజ్ఞానసంబందర్ కి యీ విషయం తెలిసింది. సంబందర్  మదురై మీనాక్షి, సుందరేశ్వరుల ఆలయ వంటశాలనుండి తెప్పించిన బూడిదను  తీసుకుని రాజు కి పూత పెట్టించారు. ఆ సమయంలో సంబందర్ విభూది మహిమను గురించి ఒక పదికం తో  స్తుతించారు. రాజుకి జ్వరతీవ్రత తగ్గి ఆరోగ్యం పొందాడు. జ్వరతీవ్రతను తగ్గించి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈశ్వరుడైనందున ఈ ఈశ్వరునికి జ్వరహరేశ్వరుడని,   జ్వరహరదేవుడని  పేర్లు వచ్చాయి. కొన్ని ఆలయాలలో జ్వరహరేశ్వరర్ కి ప్రత్యేక  సన్నిధులు వున్నవి. కొన్ని  ఆలయాలు ప్రత్యేకంగా వున్నవి. రకరకాల మూర్తుల రూపంలో  ముఖ్యంగా మూడు వదనాలు, మూడు చేతులుకలిగిన రూపం, కొన్ని ఆలయాలలో శివలింగ రూపంగాను జ్వరహరశ్వరుడు దర్శనానుగ్రహాన్ని కలిగిస్తున్నాడు.  ప్రసిధ్ధి చెందిన  తిరుచ్చి ఉచ్చిపిళ్ళైయార్ ఆలయంలో  తాయ్ మానవర్ సన్నిధిలో బ్రహ్మదేవుడే ప్రతిష్టించిన  జ్వరహరేశ్వర మూర్తిగా దర్శనమిస్తున్నాడు. తిరుమళబాడిలోను,  తిరువణ్ణామలై ఆలయంలోను , సేలం సమీపమున తారమంగళం  కైలాసనాదరు ఆలయంలోను జ్వరహరేశ్వరునికి సన్నిధులున్నాయి. తమిళ నాడులోని తిరువారూరు జిల్లాలోని తిరుకంఠీశ్వరం , పశుపతినాధీశ్వరుని ఆలయం ప్రసిధ్ధి చెందినది. ఈ ఆలయంలో పశుపతినాధేశ్వరుడు,   శాంతనాయకి సన్నిధిలో వున్న వినాయకుడు, మురుగన్, చండికేశ్వరుడు, దుర్గాదేవి సన్నిధులతో, జ్వరహరేశ్వరునికి ఉప సన్నిధి వున్నది. జ్వర తీవ్రతతో బాధపడేవారు జ్వరహరేశ్వరునిమూర్తికి వేడినీటితో అభిషేకం చేసి ఉప్పుడు బియ్యం నివేదించినట్లైతే జ్వరం  తగ్గిపోయి ఆరోగ్యం చేకూరడం ప్రత్యక్ష సాక్ష్యం గా చెపుతారు. ఈ నాడు ప్రపంచ వ్యాప్తంగా  నావళిని కట్టి కుదుపుతున్న మహమ్మారిని నుండి ప్రజలను కాపాడగలిగేది ఆ పంచభూతాత్మకుడే.  ఆ జ్వరహరేశ్వరమూర్తిని  మనసారా ప్రార్ధిద్దాం ..ఇప్పుడు వున్న యీ తీవ్ర రోగాలనుండి విముక్తులవుదాము.

 

 

Related Posts