YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రఘురామ సక్సెస్ అయినట్టేనా

రఘురామ సక్సెస్ అయినట్టేనా

ఏలూరు, జూన్ 29, 
రాజ‌కీయంగా ప్రత్య‌ర్థులు వేసే ఎత్తుల‌కు పై ఎత్తులైనా.. వేయాలి.. లేదా.. వాటికి దూరంగా అయినా ఉండాలి. ఈ విష‌యంలో సీఎం జ‌గ‌న్ వ్యవ‌హారం.. రెండోదే., ఆయ‌న పెద్దగా రియాక్ట్ కారు. ఎవ‌రు ఏమ‌ని అన్నా.. ఎన్ని విమ‌ర్శలు చేసినా.. ఆయ‌న చ‌లించ‌రు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. నుంచి ఇప్పటి వ‌ర‌కు జ‌గ‌న్ పంథానే వేరు. ఎవ‌రు ఏమ‌ని అనుకున్నా..తాను చేయాల్సింది చేస్తారు. ప్రతిప‌క్ష నేత‌లు ఎంత‌గా రెచ్చగొట్టినా.. ఎన్నివ్యాఖ్యలు చేసినా. జ‌గ‌న్ తాను చేయాల‌ని అనుకున్నదే చేస్తున్నారు. ఇక‌, సొంత పార్టీ ఎంపీ.. ర‌ఘురామ‌ కృష్ణరాజు.. ప్రత్యర్థుల కంటే కూడా ఎక్కువ‌గా విమ‌ర్శలు గుప్పించారు. ఇప్పటికీ గుప్పిస్తూనే ఉన్నారు. దీనికి ప్రధాన కార‌ణం.. త‌న‌కు గుర్తింపు లేద‌నే కార‌ణం కావొచ్చు.. లేదా.. పార్టీలో తాను జ‌గ‌న్ త‌ర్వాత జ‌గ‌న్ రేంజ్‌లో త‌న‌కు ప్రాధాన్యం కావాల‌ని భావించి ఉండొచ్చు. అయితే.. ఆ రేంజ్ ఇచ్చేందుకు జ‌గ‌న్ ఎందుకు ఒప్పుకుంటారు ? ఒప్పుకోరు. గ‌తంలోనూ బీజేపీలో ఉన్న ర‌ఘురామ‌ కృష్ణరాజుకు కేంద్రంలోని బీజేపీ నేత‌ల ద‌గ్గర మంచి ప‌లుకుబ‌డి ఉన్న మాట వాస్తవం. దీంతో రాష్ట్ర అవ‌స‌రాల కోసం.. జ‌గ‌న్ త‌న‌పై ఆధార‌ప‌డి ఉంటే బాగుంటుంద‌ని.. ఆయ‌న భావించి ఉండొచ్చు. కానీ, రాష్ట్రపార్టీ అధినేత‌..జ‌గ‌న్‌.. ఆ అవ‌కాశం ఎందుకు ఇస్తారు. ఇదే ర‌ఘురామ‌ కృష్ణరాజుకు వైసీపీకి మ‌ధ్య తేడా రావ‌డానికి కార‌ణంగా ఉంద‌ని అంచ‌నాలు ఉన్నాయి. స‌రే… ఏదేమైనా.. వైసీపీని టార్గెట్ చేస్తూ ర‌ఘురామ‌ కృష్ణరాజు వ్యాఖ్యలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై క‌సి తీర్చుకోవాలనేది ర‌ఘురామ‌ కృష్ణరాజు ల‌క్ష్యం అనే విష‌యం స్పష్టమ‌వుతోంది. ఈ క్రమంలోనే ఇటీవ‌ల కాలంలో అంటే.. సీఐడీ కేసు న‌మోదు త‌ర్వాత‌.. మ‌రింత వేగం పెంచారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కోరుతూ.. కేసు వేయ‌డం.. ఆయ‌న వ్యాపారాల‌ను టార్గెట్ చేయ‌డం తెలిసిందే. ఇక‌.. అప్పటి వ‌ర‌కు అంటే.. దాదాపు ఏడాది కాలంగా ర‌ఘురామ‌ కృష్ణరాజు విష‌యంలో పెద్దగా జోక్యం చేసుకోని ..జ‌గ‌న్‌.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న విష‌యంలో సీరియ‌స్‌గానే స్పందిస్తున్నట్టు క‌నిపిస్తోంది. ఇదే.. ర‌ఘురామ‌ కృష్ణరాజు కూడా కోరుకున్నది. అంటే.. త‌న విష‌యంలో జ‌గ‌న్ రెచ్చిపోయి.. అంతిమంగా.. కేంద్రంలోని బీజేపీతో జ‌గ‌న్‌కు ఉన్న స‌న్నిహిత‌త్వం తెగిపోవాల‌నే ర‌ఘురామ తాప‌త్రయ పడుతున్నారా ? అన్న సందేహం కూడా ఉంది.ర‌ఘురామ‌ కృష్ణరాజు ఎప్పటి నుంచో కోరుకుంటున్నా.. ఇప్పుడు జ‌గ‌న్ స్పందిస్తున్న తీరు.. ఇక‌, ర‌ఘురామ సక్సెస్ అవుతున్నట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల ఢిల్లీలో సీఎం జ‌గ‌న్‌.. అమిత్ షాను క‌లుసుకుని వ‌చ్చిన త‌ర్వాత అనూహ్యంగా.. కేంద్రంపై జ‌గ‌న్ వైఖ‌రి మారిన‌ట్టు స్పష్టంగా క‌నిపిస్తోంది. ఎంపీ ర‌ఘురామ‌ కృష్ణరాజు స‌భ్యత్వాన్ని ర‌ద్దు చేయాల‌ని.. తాము లేఖ స‌మ‌ర్పించి.. నెల‌లు గ‌డుస్తున్నా.. చ‌ర్యలు తీసుకోవ‌డం లేదంటూ విజ‌య‌సాయిరెడ్డి ఏకంగా స్పీక‌ర్‌కు లేఖ‌రాయ‌డం సంచ‌లనంగా మారింది.అదే స‌మ‌యంలో మారిటోరియం బోర్డు విష‌యంలో ఎంత‌కైనా వెళ్తామ‌ని.. ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి పేర్కొన‌డం.. వంటివి కేంద్రంతో అమీతుమీకి జ‌గ‌న్ రెడీ అవుతున్నార‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. మొత్తంగా చూస్తే.. వీటి వెనుక‌.. ర‌ఘురామ‌ కృష్ణరాజు చేస్తున్న వ్యాఖ్యలు.. త‌ద్వారా.. ఆయ‌న‌పై చ‌ర్యలు తీసుకోవ‌డం లేద‌నే అక్కసుతో జ‌గ‌న్‌.. ఆయ‌న ట్రాప్‌లో చిక్కుకుని కేంద్రంలోని బీజేపీతో సై! అంటున్నార‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఇదే జ‌రిగి..కేంద్రంతో క‌టీఫ్ అయితే.. ర‌ఘురామ‌ కృష్ణరాజు ల‌క్ష్యం నెర‌వేరిన‌ట్టేన‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Related Posts