YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మద్దసాని పైనే ఆశలు

మద్దసాని  పైనే ఆశలు

కరీంనగర్, జూన్ 29, 
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎలాగైనా టీఆర్ఎస్ విజయం సాధించాలన్న పట్టుదలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారు. ఎన్ని బిజీ కార్యక్రమాల్లో ఉన్నా కేసీఆర్ మాత్రం హుజూరాబాద్ మీద మాత్రం ఒక కన్నేసి ఉంచారు. అక్కడి ప్రతి అంశాన్ని తన దృష్టికి తేవాలని కేసీఆర్ ఆదేశించారు. ఈటల రాజేందర్ ను ఈ ఉప ఎన్నికల్లో ఓడించగలిగితేనే పార్టీ ప్రతిష్టతో పాటు వ్యక్తిగతంగా కేసీఆర్ ఇమేజ్ పెరుగుతుంది. లేకుంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. అందుకోసం కేసీఆర్ ఇప్పటి నుంచే హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇద్దరు మంత్రులను ఇన్ ఛార్జులుగా నియమించారు. అయితే ఈటల రాజేందర్ పై పోటీకి దింపేందుకు ధీటైన అభ్యర్థికోసం కేసీఆర్ ఇంకా అనేక పేర్లను పరిశీలిస్తూనే ఉన్నారు. సామాజిక సమీకరణాలతో పాటు గెలుపు గుర్రాలను బరిలోకి దించాలన్న లక్ష్యంతో రోజుకో పేరు ఆయన పరిశీలనకు వెళుతుంది. గతలో ఈ ప్రాంతంలో రాజకీయంగా ప్రభావితం చేసిన ముద్దసాని కుటుంబం నుంచి బరిలోకి దించితే ఎలా ఉంటుందన్న దానిపై కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ముద్దసాని దామోదర్ రెడ్డి కమలాపూర్ నియోజకవర్గం నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయనకు మంచి పేరుంది. దామోదర్ రెడ్డి 2012లో మృతి చెందారు. అయితే ఆయన సోదరుడు ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.ముద్దసాని పురుషోత్తం రెడ్డి ఐఏఎస్ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల కలెక్టర్ గా కూడా పనిచేశారు. సమర్థుడైన అధికారిగా పేరుంది. రెడ్డి సామాజికవర్గంతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి కూడా కావడం, ఆ కుటుంబానికి మంచి పేరు ఉండటంతో ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటిలిజెన్స్ నివేదికను కూడా ఆయన తెప్పించికున్నట్లు చెబుతున్నారు. అయితే హుజూరాబాద్ అభ్యర్థి పేరును చివరి నిమిషం వరకూ ప్రకటించే అవకాశాలులేవని మాత్రం పార్టీ వర్గాలు మాత్రం చెబుతున్నాయి.

Related Posts