కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఉన్న అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం కంప్లి. ఇది ప్రముఖ పర్యాటక క్షేత్రం హంపికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఈ నియోజకవర్గంపై పడింది. ఇక్కడ తెలుగు ప్రజల ప్రభావం చాలా ఎక్కువుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో దాదాపు ఏడెనిమిది పార్టీలు ఉన్నప్పటికీ.. ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్-బీజేపీ లహవానే ఇక్కడ కూడా కనిపిస్తోంది. రెండు సార్లుగా ఇక్కడ బీజేపీ జయ కేతనం ఎగుర వేస్తోంది. సురేష్‌బాబు హ్యాట్రిక్‌కు రెడీ అవుతుంటే అటు గణేష్ దూకుడుగా ముందుకు వెళుతూ ఇక్కడ సురేష్‌కు చెక్ పెట్టేందుకు వ్యూహాలు పన్నుతున్నాడు. వాస్తవానికి పార్టీలకన్నా కూడా .. వ్యక్తుల మధ్య పోరుగా ఇక్కడ మారిపోయిందని ఎన్నికల పరిశీలకులు చెబుతున్నారు. ఇక, ఈ ఇద్దరు అభ్యర్థులు తరఫున కూడా పార్టీలు భారీ రేంజ్‌లో ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేశాయి. గణేష్‌కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణ రెడ్డి, మాజీ మంత్రి సంతోష్ లాడ్ లు ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు. ఇక, సురేష్ తరఫున కూడా బీజేపీ నేతలు భారీ స్థాయిలో ప్రచారానికి వ్యూహం సిద్ధం చేసుకున్నారు. అయితే, ఇక్కడ పార్టీల కన్నా కూడా అభ్యర్థులకే ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పటికే రెండు సార్లు గెలిచిన సురేష్ పట్ల ఇక్కడ వ్యతిరేకత లేకపోవడం ఆయనకు కలసి వస్తున్న అంశం కాగా, కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ కు కూడా ఇక్కడ సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది. దీంతో ఇద్దరిలో గెలుపు ఎవరిదైనా.. మెజారిటీ అతి స్వల్పంగానే ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఓవరాల్‌గా కంప్లీలో సురేష్ బాబు వర్సెస్ గణేష్ మధ్య నరాలు తెగే ఉత్కంఠ భరిత పోరు జరుగుతోంది.2008లో కర్ణాటకలోనే కాకుండా బళ్లారి జిల్లాలో బలంగా వీచిన బీజేపీ గాలిలో తొలిసారి గెలిచిన సురేష్‌బాబు 2013 ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయం సాధించారు. సురేష్‌బాబుకు స్థానికంగా మంచి పేరే ఉంది. అయితే, ఇక్కడ కాంగ్రెస్ తరపున గతంలో పోటీ చేయాలని భావించిన జీఎన్ గణేష్‌కు అప్పట్లో టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్‌గానే బరిలోకి దిగాడు. అయితే, గణేష్‌కు అప్పట్టో ఓట్లు బాగానే పడ్డాయి. గత ఎన్నికల్లో ఇక్కడ గణేష్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా 37 వేల ఓట్లు తెచ్చుకుని సత్తాచాటాడు. గణేష్ బలంగా ఓట్లు చీల్చడంతోనే ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ ఏరికోరి గణేష్‌కు టికెట్ ఇచ్చింది. దీంతో బీజేపీ తరఫున సురేష్, కాంగ్రెస్ తరఫున గణేష్ ల పోరు సరవత్తరంగా మారింది. వాస్తవానికి కంప్లి నియోజకవర్గం నుంచి మొత్తం 9 మంది అభ్యర్తులు బరిలో ఉన్నప్పటి కీ.. కేవలం వీరిద్దరి చుట్టూనే అందరి దృష్టీ ఉండడం గమనార్హం. ఇప్పటికే రెండు సార్లు గెలిచిన సురేష్ మరోసారి గెలవడం ద్వారా రికార్డు సృష్టించాలని భావిస్తున్నారు. అయితే, సురేష్‌ను ఓడించడం ద్వారా తన హవా నిలుపుకోవాలని గణేష్ భావిస్తున్నాడు. మొత్తంగా ఇద్దరూ కూడా ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు.