YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేవంత్ రఫ్ ఆడిచ్చేస్తారా

 రేవంత్ రఫ్ ఆడిచ్చేస్తారా

హైదరాబాద్, జూన్ 29, 
రాహుల్ గాంధీ నిద్ర లేచాడు” నిన్న రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువగా విన్పించిన కామెంట్. ఈ కామెంట్ రేవంత్ అభిమానుల నుంచి రాలేదు. విశ్లేషకులు, తెలంగాణ రాజకీయాలను దగ్గర నుంచి గమనిస్తున్న వారి నుంచే ఈ కామెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి నియామకంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? రాదా? అన్నది పక్కన పెడితే పార్టీ బలోపేతం అవుతుందన్నది మాత్రం వాస్తవంరేవంత్ రెడ్డి పార్టీ మారి రావచ్చు. చిన్న వయసులో పెద్ద పదవి దక్కవచ్చు. కానీ ఆయనకున్న క్వాలీటీస్ పదవులు వెతుక్కుంటూ వస్తున్నాయి. టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన రేవంత్ రెడ్డి వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేవలం మూడున్నరేళ్లలోనే పీసీసీ చీఫ్ కావడం అంటే సామాన్యమైన విషయం కాదు. రేవంత్ రెడ్డిపై ప్రత్యర్థులు చేసిన ఫిర్యాదులు ఏవీ హైకమాండ్ పట్టించుకోలేదు. ఓటుకు నోటు కేసు, చంద్రబాబు మనిషి, దూకుడు స్వభావం ఇలాంటి ఫిర్యాదులన్నీ రేవంత్ రెడ్డికి ప్లస్ అయ్యాయంటున్నారు.రేవంత్ రెడ్డి దూకుడు స్వభావంతో పాటు మాటకారి. కేసీఆర్ ఎలాగైతే మాటలతోనే రాష్ట్రాన్ని సాధించారో అదే మాటలతో పార్టీని రేవంత్ రెడ్డి అధికారంలోకి తీసుకురాగలడన్న నమ్మకం కిందిస్థాయి క్యాడర్ లో ఉంది. రేవంత్ రెడ్డి టార్గెట్ అంతా కేసీఆర్ ఆయన కుటుంబంపైనే ఉంటుంది. కొన్నేళ్లుగా పోరాడుతున్న రేవంత్ రెడ్డి ఇకపై మరింత స్పీడ్ పెంచే అవకాశముంది. కాంగ్రెస్ క్యాడర్ లోనూ జోష్ నెలకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.ఇక కాంగ్రెస్ నేతలంటారా? వారు రేవంత్ రెడ్డికి సహకరిస్తారా? లేదా? అన్నదే ప్రశ్న. సహకరించరన్నది అందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయమూ వివాదం చేయడానికే వారు ఇక ప్రయత్నిస్తారు. అధిష్టానానికి రానున్న కాలంలో ఫిర్యాదులు మీద ఫిర్యాదులు వెళతాయి. రేవంత్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకుని తన ప్రణాళికను రూపొందించుకంటారు. మరో రెండేళ్లే సమయం ఉండటంతో రేవంత్ రెడ్డి సత్తా ఏంటనేది వచ్చే ఎన్నికల తర్వాతనే తెలియనుంది. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ కు ఇప్పటికైతే మంచిరోజులొచ్చినట్లేనని భావించాలి.

Related Posts