YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

నెలవారీగా మాత్రమే ట్యూషన్‌ ఫీజులు వసూలు చేయాలి... ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ ఉత్తర్వులు

నెలవారీగా మాత్రమే ట్యూషన్‌ ఫీజులు వసూలు చేయాలి...   ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ ఉత్తర్వులు

హైదరాబాద్‌, జూన్‌ 29
ప్రైవేట్‌ స్కూళ్లు 2021-22 విద్యా సంవత్సరానికి ఫీజులను పెంచవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఫీజులు పెంచడానికి వీల్లేదని స్పష్టంచేసింది. రాష్ట్ర పరిధిలోని స్కూళ్లతో పాటు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సహా ఇతర ఇంటర్నేషనల్‌ బోర్డుల నుంచి గుర్తింపు పొందిన స్కూళ్లన్నీ ఆదేశాలను పాటించాలని పేర్కొన్నది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా జీవో 75 ద్వారా జారీచేశారు. గత ఏడాది జారీ చేసిన జీవో 46 ప్రకారమే స్కూళ్లు నడుచుకోవాలని జీవోలో పేర్కొన్నారు. అదీకాక ట్యూషన్‌ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని, అది నెలవారీగా మాత్రమే తీసుకోవాలని స్పష్టంచేశారు. నిబంధనలను పాటించని విద్యాసంస్థల గుర్తింపును రద్దుచేస్తామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీవో అమలుకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.

Related Posts