YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అంబేద్కర్ యూనివర్సిటీ ఉద్యోగులకు జీతాలు వెంటనే చెల్లించాలి

అంబేద్కర్ యూనివర్సిటీ ఉద్యోగులకు జీతాలు వెంటనే చెల్లించాలి

నెల్లూరు
అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించాలని దళిత సేన నేత పూర్ణ ప్రకాష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో గళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామకార్థం తో పేద మధ్య తరగతి విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్లో 1982లో మొదటిసారిగా సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు అయింది అన్నారు. ప్రస్తుతం అంబేద్కర్ యూనివర్సిటీ ఉద్యోగులకు 16 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 1991లో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం గా పేరు మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, 2014 వరకు 13 జిల్లాలకు సంబంధించి 20 వేల మంది పైచిలుకు విద్యార్థులు డిగ్రీలో చేరుతూ వచ్చారన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. అంబేద్కర్ యూనివర్సిటీ కేవలం హైదరాబాదులో ఉన్నందున ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అంబేద్కర్ యూనివర్సిటీ హైదరాబాదులో ఉన్నందున తెలంగాణ ఉద్యోగస్తులకు మాత్రమే జీతాలు చెల్లిస్తూ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు జీతాలు పెండింగ్ లో పెట్టడం శోచనీయం అన్నారు. 2017 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సి ఎఫ్ ఎం ఎస్ విధానం వలన పార్ట్ టైం ఉద్యోగుల జీతాలు నిలిచిపోవడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 96 అధ్యయన కేంద్రాలు ఉండగా రాష్ట్ర విభజన అనంతరం ఆ సంఖ్య 76 కు పడిపోయిందన్నారు. అధ్యయన కేంద్రంగా పని చేస్తున్న సుమారు 350 మందికి గౌరవ వేతనాలు అద్భుత లేదని పేర్కొన్నారు. ఇటువంటి ఇబ్బందులు అంబేద్కర్ యూనివర్సిటీ లో తలెత్తకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో త్వరితగతిన అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మీడియా ద్వారా విన్నవించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సిబ్బంది ఎం రత్నయ్య, ఖాజావలి, హజరత్తయ్య, పద్మనాభం, నవీన్ కుమార్, రమేష్, శరత్, కమలనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts