YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఉద్యోగం ఇస్తారా.... లేక జైల్లో పెడతారా ? ఏఐఎస్ఎఫ్

ఉద్యోగం ఇస్తారా.... లేక జైల్లో పెడతారా ? ఏఐఎస్ఎఫ్

ఎమ్మిగనూరు
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18వ తేదీన విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో కేవలం 10143 మాత్రమే ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్ ను విడుదల చేయడం పట్ల నిరుద్యోగులు పెద్దఎత్తున రోడ్ ఎక్కడం జరిగిందని  అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) తాలూకా అధ్యక్షులు సామీ ఉల్లా మాట్లాడుతూ  తెలిపారు. అనంతరం స్థానిక సిపిఐ కార్యాలయంలో ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సామీఉల్లా మాట్లాడుతూ ఎన్నికల ముందు జాబు కావాలంటే బాబు పోవాలి  అని నినాదం తో పాదయాత్ర చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జాబ్ లు రాలేనందు వలన, బాబుకు గద్దె దింపాలని ఆకాంక్షతో నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు,యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి జగన్ మోహన్ రెడ్డి ని అధికారం లోకి తీసుకో రవాడం జరిగింది. అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాల కాలంలో ఏ మాత్రం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయకుండా నిరుద్యోగులకు మభ్య పెట్టడం జరిగిందని ఎట్టకేలకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి అందులో కేవలం 10,143 మాత్రమే ఉద్యోగాలు పొందుపరచడం జరిగింది. మిగితా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2,35,794 ఖాళీగా ఉంటే దానిని భర్తీ చేయడంలో పూర్తిగా విఫలం కావడం జరిగింది ఇప్పటికే గ్రూపు వన్ గ్రూపు టూ కి సంబంధించిన పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా 60000 పోస్టులుంటే కేవలం 34 పోస్టులు భర్తీ చేయడం జరిగింది అదేవిధంగా  పోలీసుల ఉద్యోగుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 65 వేల పోస్ట్ లు ఉంటే కేవలం 450 పోస్టులు మాత్రమే పొందుపరిచారు అదేవిధంగా 26 వేల టీచర్ పోస్టులు ఉంటే ఒక్క పోస్టుల భర్తీకి సంబంధించి పొందుపరచలేదు. సమస్యల పై నెల 28వ తేదీ శాంతియుతంగా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తే రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగుల పై కక్ష సాధింపు ధోని తో అక్రమ కేసులు బనాయించి జైలు జైలుకి పంపించడం జరిగింది. రేపటి రోజున నిరసన కార్యక్రమానికి 30వ తేదీన పిలుపు ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు షఫీ,రామంజి, ఖాదర్,నూర్ భాషా, తదితరులు పాల్గొన్నారు.పాల్గొన్నార,

Related Posts