జగిత్యాల జూన్ 28
పీఆర్సీతో కూడిన వేతనాల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈసారి కూడా నిరాశే మిగల నుందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు.జులై ఒకటిన వారంతా పాత వేతనాలనే అందుకోనున్నారు. ఇందుకు బిల్లుల ఆమోదంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలే కారణమని స్పష్టమవుతోంది. ఫలితంగా డీడీవోలు ఇది వరకు అందుకున్న వేతనాలతో కూడిన బిల్లులను ట్రెజరీకి సమర్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 12,500 పై చిలుక ఉపాధ్యాయులు,16 వేల మంది ఉద్యోగులు,25 వేల పై చిలుకు పెన్షనర్లున్నారు. జులై ఫస్ట్ కు తప్పనిసరిగా పెరిగిన వేతనం అందుకుంటామని అనుకున్న ఉద్యోగులకు ,ఉపాధ్యాయులకు ఈసారీ నిరాశే మిగలనుండడంశోచణీయమని టీ ఉద్యోగుల జేఏసి జిల్లా చైర్మన్,టీఎన్జీఓ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు భోగ శశిదర్,కొచైర్మన్,రెవెన్యూ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు ఎం.డీ.వకీల్,గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పీఆర్సీని అమలుచేస్తూ ఉద్యోగులకు,ఉపాధ్యాయులకు,పెన్షనర్లకు 30 శాతం ఫిట్మెంటు తో ఉత్తర్వులు జారీ చేసిందని, ఇందులో భాగంగా జూన్ లో అందుకుంటామన్న పెరిగిన జీతాలు జులై ఫస్టుకూ రాకపోవడం తెలిసినిరాశ కలిగించిందన్నారు. మరోవైపు పింఛనుదారులు మాత్రం వచ్చే జులై ఫస్ట్ కు పెరిగిన మొత్తంతో పింఛను డబ్బులు పొందనుండటం వారిలో సంతోశం వ్యక్తమవుతోంది.
పింఛనుదారులకు మాత్రం వర్తింపు.
-హరి అశోక్ కుమార్, పి.కేశవ రెడ్డి అధ్యక్షులు తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్, జగిత్యాల,కరీంనగర్ జిల్లాలు.
పింఛనుదారులకు జులై ఒకటో తేదీ నుంచి పెరిగిన మొత్తాన్ని చెల్లించనున్నారు. పింఛనుకు తోడు 70 ఏళ్లు దాటిన వారికి మూలవేతనంపై 15 శాతం మొత్తాన్ని అదనంగా వారి ఖాతాలో జమకానుంది. ఒక్కో పెన్షన్‌దారు పీఆర్సీ అమలుతో రూ.8 వేల నుంచి రూ.30 వేల వరకు లబ్ధి పొందనున్నారు. పెరిగిన మొత్తంతో బిల్లుల ఆమోదానికి ట్రెజరీశాఖ పచ్చజెండా ఊపి జులై ఫస్ట్ కు అందించడానికి పని చేస్తున్నారు ఫలితంగా పెన్షనర్లకు పెరిగిన మొత్తం వచ్చే నెల నుంచి చేతికి రానుంది. కొంత ఆలస్యమైనా పీఆర్సీ అమలు చేస్తుండటం సంతోషంగా ఉందని,అందించేందుకు కృషి చేస్తున్న ఉమ్మడి జిల్లాల ట్రెజరీ అధికారులు, ఉద్యోగులకు తెలంగాణ పెన్షనర్ల అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ , కార్యదర్శి బొల్లం విజయ్, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం,కరీంనగర్ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.కేశవ రెడ్డి,కార్యదర్శి ఎలదాసరి లింగయ్యలు ధన్యవాదాలు తెలిపారు. బకాయిలు చెల్లింపు గడువును పొడిగించకుండా స్వల్ప వ్యవధిలోనే అందేలా చూడాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. తమ కేంద్ర సంఘం అధ్యక్షుడు గాజుల నర్సన్న,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీత రావులు రాష్ట్ర ట్రెజరీ డైరెక్టర్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లకు జులై ఫస్టు కే పెన్షన్ చెల్లింపులు జరపాలని కోరడం పట్ల ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లాల సంఘాల తరపున రాష్ట్ర పెన్షనర్ల నేతలకు ధన్యవాదాలు తెలిపారు.