YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

జ‌మ్మూలో మ‌ళ్లీ డ్రోన్లు క‌ల‌క‌లం.. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అప్ర‌మ‌త్తం

జ‌మ్మూలో మ‌ళ్లీ డ్రోన్లు క‌ల‌క‌లం.. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అప్ర‌మ‌త్తం

శ్రీన‌గ‌ర్ జూన్ 30
జ‌మ్మూలో మ‌ళ్లీ డ్రోన్లు క‌ల‌క‌లం సృష్టించాయి. బుధ‌వారం రోజు మూడు ప్ర‌దేశాల్లో డ్రోన్లను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గుర్తించాయి. దీంతో బ‌ల‌గాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. డ్రోన్ల‌ను మిరాన్ సాహిబ్, క‌లుచాక్, కుంజ్వాని ఏరియాల్లో గుర్తించిన‌ట్లు తెలిపారు. గ‌త నాలుగు రోజుల నుంచి మిల‌ట‌రీ క్యాంపుల ప‌రిస‌రాల్లో ఏడు డ్రోన్ల‌ను గుర్తించిన‌ట్లు భ‌ద‌త్రా బ‌ల‌గాలు పేర్కొన్నాయి.జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్‌ దాడిని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు అప్పగించి, సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

Related Posts