YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పల్లె ప్రగతి 32 జిల్లాలకు 32 కోట్లు

పల్లె ప్రగతి 32 జిల్లాలకు 32 కోట్లు

హైదరాబాద్, జూన్ 30, 
తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులు దృష్టి సారించి ముందుకు సాగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పల్లె ప్రగతి, హరితహారంపై ఆయా జిల్లా కలెక్టర్లు, అధికారులతోసీఎం కే. చంద్రశేఖర్ రావు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జులై 1 నుంచి పల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాలు ప్రారంభించాల‌ని అధికారులకు సూచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి సంబంధించిన పనులను పెండింగ్ లో పెట్టొదని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం బాగా సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చి, నాటేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. అయితే.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కోసం ఒక్కో జిల్లాకు రూ. కోటి చొప్పున, హైద‌రాబాద్ మిన‌హా 32 జిల్లాల‌కు రూ. 32 కోట్లు మంజూరు చేస్తూ కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను పల్లె, పట్టణ ప్రగతి పనుల కోసం వినియోగించుకోవాలని సూచించారు.గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఈ ఏడాది పంటలు బాగా పండాయని, దీంతో రాష్ట్రానికి అదనపు రైస్ మిల్లులు అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. రైస్ మిల్లుల సంఖ్య‌ను పెంచి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కలెక్టర్లను ఆదేశించారు. రైతులకు అధికారులు అండగా నిలబడాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు కేటాయించిన భూములను రిజిస్ర్టేష‌న్ చేయాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. పంచాయ‌తీలు, మున్సిపాలిటీల పేర్ల‌పై రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. క‌ల్తీ విత్త‌నాల అమ్మ‌కాల ప‌ట్ల క‌ఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
వరంగల్ లో
పల్లె ప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డినిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి పట్టణంలో జరిగిన నాలుగో విడత హరితహారం సన్నాహక కార్యక్రమంలో మత్రి మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాల్లో దళితవాడలపై ఫోకస్ చేయాలని అన్నారు. దేశం లో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వినూత్న పథకాలు ప్రవేశ పెడుతున్నారని తెలిపారు.వీటిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక శాఖలు శ్లాఘిస్తున్నాయని పేర్కొన్నారు. అనేక రాష్ట్రాలకు స్ఫూర్తి దాయకంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. సీఎం దూర దృష్టితో చేపట్టిన ప్రాజెక్టులు, రైతుబంధు వంటి పథకాలు ప్రపంచాన్ని ఆకర్షించాయని, కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనాన్ని డిస్కవరీ ఛానల్ ప్రసారం చేసిందని గుర్తు చేశారు.పర్యావరణ పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి తీర్మానానికి ముందే తెలంగాణలో సీఎం కేసీఆర్‌ చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు విజయవంతం చేయాలని సూచించారు. నిధులుఉండి అభివృద్ధి చేయని గ్రామ పంచాయతీల నిధులు వెనక్కి తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పల్లెల్లో నిద్ర చేయాలని చేయాలని ఆదేశించారు.అనంతరం పట్టణంలో విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన స్టోర్‌ను మంత్రి ప్రాంభించారు

Related Posts