చెన్నై జూన్ 30
వీకే శశికళపై తమిళనాడులో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అన్నాడీఎంకే పార్టీకి చెందిన నేత సీ వీ షణ్ముగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ కేసు బుక్ చేశారు. శశికళ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని షణ్ముగం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తమిళనాడు న్యాయశాఖ మంత్రిగా చేసిన షణ్ముగం మీడియా ద్వారా శశికళపై కొన్ని కామెంట్స్ చేశానని, అయితే దానికి ఆమె బదులు ఇవ్వలేదని, కానీ తన గుండాల చేత బెదిరిస్తోందని షణ్ముగం తన ఫిర్యాదులో చెప్పారు. ఈ నేపథ్యంలో శశికళపై ఐపీసీలోని 506(1), 507, 109 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్‌లోని 67 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు.