YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సైలెంట్ మూడ్ లోకి జనసేనాని

 సైలెంట్ మూడ్ లోకి జనసేనాని

విజయవాడ, జూలై 1, 
ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే ఇది కీలకమైన పరిణామమే. ప్రతీ దాని మీద విమర్శలు చేసే పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళుగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. కరోనా నేపధ్యంలో ఆయన హైదరాబాద్ కే పరిమితమైనా కూడా పత్రికా ప్రకటనలు మాత్రం ఆయన పేరిట వచ్చేవి. ఇక ఏపీలో జగన్ సర్కార్ ఏ చిన్న తప్పు చేసినా పవన్ చీల్చిచెండాడేవారు. అయితే ఇపుడు పవన్ కళ్యాణ్ ఫుల్ సైలెంట్ అంటున్నారు. మరో వైపు ఆయన సినిమా షూటింగులతో బిజీ అయ్యారా అంటే అది కూడాలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నా కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదు అన్న చర్చ అయితే వస్తోంది.ఇదొక్కటే కాదు ఏపీలో బీజేపీ విషయంలోనూ పవన్ కళ్యాణ్ పెద్దగా స్పందిస్తున్న దాఖాలు లేవు. బీజేపీది ఒంటరి పోరుగా మారుతోంది. ఆ పార్టీ వైసీపీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తనకున్నకొద్దిపాటి బలంతో కార్యక్రమాలు నిర్వహిస్తూంటే జనసేన మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. మరి మిత్ర పక్షం ఎందుకు అలా దూరంగా ఉండిపోతోంది, దీని వెనక ఆ పార్టీ పెద్దల గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ఇక ఈ సంగతి వారూ వీరూ కాదు, బీజేపీ మిత్రులే గ్రహించేసారుట. ఎందుకో పవన్ కళ్యాణ్ గతంలోలా లేరు అన్నది కమల శిబిరంలో వినిపిస్తున్న తాజా మాట.పవన్ కళ్యాణ్ ఏడేళ్ళుగా చాలా హడావుడి చేశారు. పొత్తులు ఎత్తులు అన్నీ కూడా ఈ మధ్యకాలంలోనే ఫుల్ గా వాడేశారు. ఎర్రన్నలతో దోస్తీ కట్టిన ఆయనే కమలం నీడనా చేరారు. మరి ఇపుడు ఆ పార్టీతోనూ రాం రాం అనేస్తే జనాలలో చులకన అవుతారు. బొత్తిగా నిలకడలేని తత్వమని ఆ వెంటనే విమర్శలు కూడా వస్తాయి. అందుకే సుదీర్ఘ ఆలోచనలలో మునిగితేలుతున్న పవన్ కళ్యాణ్ ఆ గ్యాప్ ని సైలెంట్ తో నింపేశారు అంటున్నారు. ఏపీ రాజకీయ ముఖ చిత్రం లో ఇంకా క్లారిటీ లేదు. అలాగే దేశంలో మోడీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిందా లేదా అన్నది కూడా తెలియడంలేదు. దాంతో కొన్నాళ్ళు ఓపిక పట్టి ఆ మీద తలాక్ అనేయడానికే జనసేనాని వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు అంటున్నారు.అయితే పవన్ కళ్యాణ్ బంధం తెగిపోకూడదని బీజేపీలో గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆయన ఉంటేనే ఏపీలో పొలిటికల్ గ్లామర్ కొంత అయినా నిలుస్తుందని కాషాయధారులు అంటున్నారు. ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవుతాడు అన్న రూమర్స్ కూడా పుట్టుకువచ్చాయని అంటున్నారు. అయితే మోడీ అమిత్ షాల దగ్గర ఊ ముచ్చట ఉందా లేక బీజేపీలో కొందరు పుట్టించిన పుకారా అన్నదే తెలియడంలేదుట. పవన్ కళ్యాణ్ సైతం ఇలాంటివి తన మీద వస్తున్నా అసలు నోరు మెదపడంలేదు అంటే ఆయన కూడా ఇలాంటి రాజకీయం చూసి చాలానే నేర్చుకున్నాడు అంటున్నారు. మొత్తానికి బీజేపీ విషయంలో పూర్తిగా తేల్చుకున్నాకే ఏపీ రాజకీయాల మీద పవన్ సీరియస్ గా దృష్టి పెడతారు అంటున్నారు

Related Posts