YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏడాది ముందుగానే 175 మంది....పేర్లు

ఏడాది ముందుగానే 175 మంది....పేర్లు

విజయవాడ, జూలై 1, 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి క్విక్ డెసిషన్ తీసుకోపోతున్నారు. ఆయన ఎన్నికలకు ఏడాది ముందు నుంచే నేతలను సమాయత్తం చేయాలని నిర్ణయించారు. అభ్యర్థులను ఏడాది ముందుగానే ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాలకు ఒక్కే సారి అభ్యర్థులను ప్రకటించాలని చంద్రబాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది.చంద్రబాబు నాయుడు ఎప్పుడు అన్నీ లెక్కలు వేసుకుని మరీ అభ్యర్థులు ప్రకటిస్తారు. అయితే ఈసారి అన్ని లెక్కలను పక్కన పెట్టి ఏడాది ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయాలన్న ఉద్దేశ్యంలో చంద్రబాబు ఉన్నారు. ఈ మేరకు ఆయన ఇటీవల సీనియర్ నేతలతో మాట్లాడినప్పుడు తన మనసులో మాటను బయటపెట్టినట్లు తెలుస్తోంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం వల్ల అడ్వాంటేజీ ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారుఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాలకు ఏడాది ముందు అభ్యర్థులను ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. దాదాపు వందకు పైగా నియోజకవర్గాల్లో పాత నేతలే మళ్లీ అభ్యర్థులవుతారు. కొత్త నేతలకు అవకాశం ఇచ్చి చేతులు కాల్చుకోవడం ఎందుకన్నది చంద్రబాబు ఆలోచన. ఈ ప్రయోగం ఈ ఎన్నికల్లో చేయకూడదని, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది.ఇప్పటికే కొందరు ముఖ్యమైన నేతలకు ఫోన్లు చేసి అభ్యర్థిగా ఇప్పటి నుంచే ప్రచారం చేసుకోవచ్చని కూడా చంద్రబాబు కొందరు నేతలకు సూచించినట్లు చెబుతున్నారు. ఇటీవల తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు అందరికంటే ముందు అభ్యర్థిని ప్రకటించారు. పాత సంప్రదాయానికి ఈసారి చెక్ పెట్టి ఒకేసారి అందరు అభ్యర్థులను ఏడాది ముందుగానే ప్రకటించి 2024 ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. మరి అది సాధ్యమవుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
గ్లాసు చాలు... కమలం వద్దు
తెలుగుదేశం స్ట్రాటజీ మెల్లగా మారుతోందిట. ఏపీ రాజకీయాలో తన రూట్ ఏంటో ఆ పార్టీకి మెల్లగా అర్ధమవుతోంది అంటున్నారు. మోడీ, అమిత్ షా ఉన్న బీజేపీలో ఎటూ టీడీపీకి ఆహ్వానాలు ఉండవు, అవమానాలు తప్ప. ఇక బీజేపీ మీద దేశంలోనే కాదు, ఏపీలోనూ పీక బండెడు కోపాలు ఉన్న తరువాత పొత్తు పెట్టుకుంటే తామూ మునిగిపోవడం ఖాయమన్న ఆలోచనలు ఎవరో పసుపు పార్టీ పెద్దలకు కలుగుతున్నాయట. అందుకే జనసేనాని పవన్ కల్యాణ్ చేరదీసేందుకు రెడీ అవుతోందిట.ఏపీలో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన విషయంలో భారీ ఉద్యమాన్ని చేపడతామని ఆంధ్రా మేధావుల సంఘం ప్రెసిడెంట్ చలసాని శ్రీనివాస్ తాజాగా చెబుతున్నారు. జగన్ కి రెండేళ్ళు మాత్రమే టైమ్ ఇచ్చామని ఆయన అంటున్నారు. కేంద్రాన్ని వైసీపీ నేతలు అసలు నిలదీయలేకపోతున్నారు అంటూ ఆయన మండిపడుతున్నారు. మొత్తానికి మొత్తం వైసీపీ ఎంపీలు మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలని కూడా పిలుపు ఇచ్చారు. ఇక మలి విడత హోదా ఉద్యమం ఏపీలో తీవ్రంగా ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. విపక్షాలు కూడా తమ పోరాటానికి కలసి రావాలని కోరుతున్నారు.అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చలసాని సహా వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు అంతా హోదా విషయంలో ఆందోళన చేపట్టారు. ఇపుడు జగన్ సీఎం. మళ్ళీ హోదా ఉద్యమం అంటున్నారు. నాడు హోదా ఉద్యమ ఫలితాలను వైసీపీ అందుకుంది. ఇపుడు టీడీపీ రెడీగా ఉందా. అంటే అవును అన్న మాట వినిపిస్తోంది. జగన్ జాబ్ క్యాలండర్ ఎవరికి కావాలి. హోదా వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటూ అపుడే సమర నినాదాన్ని టీడీపీ వినిపిస్తోంది. కేంద్రం నుంచి రావాల్సింది ఎందుకు తెచ్చుకోరు అంటున్నారు చలసాని, తాము ముందుండి మోడీ మీద పోరు సలుపుతామని, ప్రజలంతా తమ వైపేనని కూడా ఆయన అంటున్నారు.ఇక చలసాని లాంటి వారు రంగంలోకి దిగడం వెనక కూడా వ్యూహాలు ఉన్నాయా అంటే ఆలోచించాల్సిందే అన్న జవాబు వస్తుంది. ఏపీలో బీజేపీకి ఇప్పటికీ ఓటు బ్యాంక్ సరైనది లేదు. పైగా దేశంలో మోడీ క్రేజ్ తగ్గిపోతోంది. దాంతో బీజేపీ తో జట్టు కట్టిన పవన్ కల్యాణ్ ని తమ వైపు తిప్పుకుంటే చాలు ఏపీలో వైసీపీని, బీజేపీని కూడా బదనాం చేయవచ్చు అన్న పక్కా ప్లాన్ ఏదో పసుపు పార్టీ దగ్గర ఉందని అంటున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా ప్రజా సంఘాలు, హోదా సాధన సమితి వారు ఉద్యమిస్తే వాటి ఫలాలు తాము పొందవచ్చు అన్నదే ఆలోచనట. నాడు మోడీని ఒక్క మాట అనకుండా జగన్ చంద్రబాబునే టార్గెట్ చేసేవారు, ఇపుడు కూడా జగన్ ని టార్గెట్ చేస్తూ టీడీపీ రంగంలోకి వస్తుంది, హోదా మీద పోరాడుతుంది అంటున్నారు. ఇక బీజేపీని బ్యాడ్ చేస్తూ పవన్ కల్యాణ్ ని చేరదీస్తే రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయం తమకు అనుకూలం అవుతుందన్నదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related Posts