ఒంగోలు, జూలై 2,
వర్షాకాలం మొదలైంది. జాగ్రత్తగా ఉండకుంటే సీజనల్ వ్యాధులతో జేబులు గుళ్ల చేసుకోవాల్సిందే. మనం పీల్చే గాలిలో మనుగడుకు మొట్టమొదటి అవసరమైన ప్రాణవాయువే కాక... ప్రాణాంతక వ్యాధులకు మూలమైన వైరస్‌లూ ఉంటాయి. అలాగే మనం నిత్యం జీవించే పరిసరాల్లోనే ఎన్నో జబ్బుల్ని వ్యాపింపజేసే కలుషిత వాతావరణమూ ఉంటుంది. రకరకాల పంటలనూ, ఫలాలనూ, పూలనూ కానుకగా రుతువులే... కొన్ని కష్టాలనూ తెచ్చిపెడతాయి. మొన్నటి వరకు ఎండలు ఉక్కుకి బిక్కిరి చేశాయి. జూన్ రెండో వారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. గతేడాది జిల్లాలో డెంగ్యూ కేసులు 420, ఈ ఏడాది ఇప్పటి వరకు 6 డెంగ్యూ కేసులను గుర్తించారు. అప్రమత్తంగా లేకుంటే ఈ ఏడాది కూడా పారిశుధ్య లోపం డెంగ్యూ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో దోమలు, ఈగలు, వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులు ప్రబలే బెడద ఎక్కువ. న్రపజలపై ప్రతాపం చూపుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, డయేరియా. ఫైలేరియా, మెదడువాపు వంటి వ్యాధులను నిరోధించవచ్చు. వర్షకాలంలో వచ్చే వ్యాధులు, వాటిని నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలుషిత నీటిని తాగడం, కలుషిత ఆహారం తినడంవల్ల డయేరియా ప్రబలే అవకాశం ఉంటుంది. వర్షాలకు ఇంటి పరిసరాలు చిత్తడిగా మారి ఈగలు పెరుగుతాయి. ఈగలు మనం తినే ఆహార పదార్థాలపై వాలి కలుషితం చేస్తాయి. దీంతో ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకకుండా పరిసరాల శుభ్రతను పాటించాలి. ఇంట్లోకి ఈగలు రాకుండా జాలీ వంటివి ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఆహార పదార్థాలు, ద్రవపదార్థాలు పడేయకూడదు. వేడి పదార్థలను తినాలి. డెంగ్యు ..ఈ వ్యాధి అన్ని సీజన్ల లో వచ్చినా వర్షాకాలం ప్రారంభంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇది 'ఎడీస్ ఈజిప్టు' అనే దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఈ దోమ మంచినీటిలో పెరుగుతుంది. ఈ దోమ కుట్టిన పది రోజులకు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన జ్వరం, తలనొప్పి డెంగ్యూ లక్షణాలు. వ్యాధిగ్రస్తులకు రక్తకణాలు తగ్గి పరిస్థితి విషమించే ముప్పు ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యు సోకుండా చూసుకోవచ్చు ఇంట్లో కూలర్లు, పూలకుండీలు, రబ్బరు టైర్లు, పడేసిన కొబ్బరి చిప్పల్లో డెంగ్యు దోమలు పెరుగతాయి. నీటి ట్యాంకుల్లోనూ ఉంటాయి. నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మెదడువాపు వ్యాధి...వర్షాలు కురిసే సమయంలో ఈ వ్యాధి ప్రబలుతుంది. దీన్ని ' జపనీస్ ఎన్‌సెఫలైటీస్' అని కూడా పిలుస్తారు. ఇది పందుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఇంటి చుట్టూ పందులు సంచరించినా, ఇళ్ల మధ్యలో పందులను పెంచినా ఈ వ్యాధి మనుషులకు సంక్రమిస్తుంది. జర్వం, మెదడులో వాపు సంభవించి కొన్ని సందార్భల్లో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకకుం డా పందులు ఇంటి పరిసరా ల్లో తిరగకుం డా చూసుకోవాలి. మొదట ఇంటి పరిసరాల్లో మురుగు గుంతలు, బురద గుంతలు లేకుండా చూసుకోవాలి. ఒక వేల ఉంటే గుంతలను పూడ్చేయాలి. వేసవిలో తక్కువగా ఉండే దోమలు, వర్షాలు కురవడంతో వృద్ధి చెందుతాయి, ' ఆడ' ఎనాఫిలస్ దోమ వల్ల మలేరియా వస్తుంది. నీటి నిల్వల్లో ఇది పెరగుతుంది. ఈ దోమ కుట్టిన వారం రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. సాయంత్రం చలి జ్వరం వస్తుంది. ఇంటి అవరణం, పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి సోకకుండా ఉండవచ్చు. ఫైలేరియా.. క్యూలెక్స్ దోమ కాటు వల్ల ఫైలేరియా వ్యాధి సంక్రమిస్తుంది. శరీరంలోని ఏ భాగానికైనా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా మురుగునీరు నిల్వ ఉండే చోట ఈ దోమలు పెరుగతాయి. వానాకాలం ప్రారంభంలోనే నీటి నిల్వలు, మురుగునీటి నిల్వలు, బురదనీరు ఎక్కడపడితే అక్కడ నిల్వ ఉండడంతో ఈ దోమలు వృద్ధి చెందుతాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం వల్ల దోమల వృద్ధిని అరికట్టి ఈ వ్యాధి సోకుండా చూసుకోవచ్చు. ఎండాకాలం పోయి వర్షాలు కురుస్తున్నందున వైరస్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. వైరస్‌ల వల్లే మనుషులు అనారోగ్యానికి గురవుతారు. దగ్గు, జలుబుతో మొదలై జ్వరం వస్తుంది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే వాంతులు, విరేచనాలు ఎక్కువై ప్రమాదం భారిన పడే అవకాశం ఉంది. వృద్ధుల్లో శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఆయాసం పెరిగి శ్వాస ఆడక ఇబ్బంది పడతారు. చిన్నపిల్లల్లో జ్వరం ఎక్కువగా వస్తే మూర్ఛపోయే అవకాశాలు ఎక్కువ. నిల్వ ఉన్న పదార్థలు తినకూడదు. ఇంటి అవరణంలో నిల్వకుండా జాగ్రత్తలుపాటించడం వల్ల వైరస్‌లు వ్యాపించవు. కలుషితమైన నీటిని తాగడం వల్ల కూడా శరీరంలోకి వైరస్ వ్యాపిస్తుంది. స్వచ్ఛమైన నీటిని తాగాలి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి సరళమ్మ తెలిపారు