YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

హైదరాబాద్ కు టెర్రర్ లింక్స్

హైదరాబాద్ కు టెర్రర్ లింక్స్

హైదరాబాద్, జూలై 2, 
దేశంలో ఎక్కడ ఉగ్రవాదం జరిగిన మూలాలు హైదరాబాద్ లో ఉంటాయనే అపవాదు ఒకప్పుడు భాగ్యనగరానికి ఉండేది. 2013 దిల్ షుక్ నగర్ పేలుళ్ల తర్వాత హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. కానీ తాజాగా బీహార్ లోని దర్భంగా రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న పేలుడు మూలాలు హైదరాబాద్ లోనే బయటపడటం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ నెల 17 న దర్భంగా రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ ఫాం వద్ద సికింద్రాబాద్ నుంచి వచ్చిన రైలు నుంచి ఓ పార్సిల్ దిగుతుండగా పేలుడు సంభవించింది. ఎవరికీ గాయాలు కాలేదు.కానీ ఉగ్రవాద కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది పార్సిల్ దర్భంగా కు చెందిన అర్షద్ సూఫియాన్ అనే వ్యక్తికి ఉన్నట్లు గుర్తించింది.మొదటగా కేసుకు సంబంధించిన క్లూ రాగానే ఎన్ఐఏ ఉత్తరప్రదేశ్ చెందిన తండ్రీకొడుకులు మహమ్మద్ సలీం ఖాసిం, మహమ్మద్ రఫీ లను అరెస్టు చేసింది. వీరిద్దరికీ పాకిస్థాన్ నుంచి నిధులు బదిలీ అయినట్లు తేలింది పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి వీరికి డబ్బు పంపినట్లు గురించారు. విచారణ తర్వాత ఇక్బాల్ ద్వారా వీరిద్దరికీ హైదరాబాద్ లో ఉంటున్న ఇమ్రాన్, నజీర్ పరిచయం ఉన్నట్లు నిర్ధారించారు జాతీయ దర్యాప్తు సంస్థ. అదే సమయంలో పేలుళ్లకు కారణమైన పార్సిల్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. బీహార్ అధికారుల బృందాన్ని సికింద్రాబాద్ కు పంపారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి పలు ఆధారాలు సేకరించారు. ఇక్కడే విచారణ సంస్థకు సీసీ ఫూటేజ్ రూపంలో అసీఫ్ నగర్ కు చెందిన ఇద్దరు సోదరులు ఇమ్రాన్ నజీర్ పార్సెల్ పంపినట్లు గా గుర్తించారు.నెల 15న కారులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చిన ఇద్దరు యువకులు పార్సిల్ రైల్వే కౌంటర్ వద్ద అందజేసినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. వారిద్దరినీ ఎన్ఐఏ అధికారులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారిని ఇమ్రాన్, నజీర్ అని ఇద్దరు అన్నదమ్ములుగా గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరూ బీహార్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల నిర్బంధంలో ఉన్నారు. ఈ ఇద్దరు సోదరులు ఎవరు అన్న కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోంది హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో ఉంటున్న ఇమ్రాన్, నజీర్ యూపీ కి చెందిన వారని అధికార వర్గాలు తెలిపాయి. యూపీ నుంచి రెడీమేడ్ వస్త్రాల వ్యాపారం చేసేందుకు హైదరాబాద్ లోని మెహిదీపట్నం ఆసిఫ్ నగర్ కు వచ్చారు. ఆర్డర్లపై పలు ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈ క్రమంలోనే యూపీ కి పంపారు. అయితే వస్త్రాల మధ్య లో ఉన్న సీసా పెట్టి పార్సిల్ చేశారు. ఆ సీసా ఉన్న పార్సిల్ బాక్స్ దింపుతుండాగా పేలింది. అందులో ఉన్న ద్రవపదార్థం కారణంగా పేలుడు సంభవించింది. అయితే ప్రాణ నష్టం జరగలేదు.యూపీలో అరెస్ట్ అయిన తండ్రి కొడుకులు హైదరాబాద్ లోని ఇమ్రాన్ నజీర్ పేర్లు చెప్పారు. సి సి ఫుటేజ్ లో కూడా ఈ ఘటన వెనక వీరి పాత్ర నిక్షిప్తమై ఉందని అధికారులు పేర్కొన్నారు.‌ అయితే ఈ నెట్ వర్క్ వెనుక నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ముంబై జైల్లో ఉన్న ఆపరేటివ్ యాసిన్ భత్కల్ పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పడినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దర్భంగా రైల్వే స్టేషన్ లో జరిగిన పేలుడు కారణమైన ద్రవపదార్థం ఏమిటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది బీహార్ ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు పేలుడు ఘటనా స్థలం నుంచి నమూనాలను అక్కడి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు తరలించారు అక్కడ నిర్ధారణ కాలేదని సమాచారం దీంతో కొలకత్తా లోని ఐఎస్ఎల్ ల్యాబ్కు పంపించారు పోలీసులు.అయితే ఇప్పటి వరకు అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ జరుపుతున్న విచారణలో అనేక కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సికింద్రాబాద్ నుండి పార్సిల్ దర్భంగా లో కలెక్ట్ చేసుకునే వ్యక్తి అర్షద్ సుఫీయాన్ పట్టుబడితే మరిన్ని వివరాలు బయటకు వస్తాయి. దేశంలో లో ఏయే ప్రాంతాల్లో పేలుడుకు ప్లాన్ చేశారనే విషయాలు బయటపడతాయి. అలాగే దర్భంగాకి పేలుడు పదార్థాలను ఇంకా ఎక్కడినుంచి పంపిస్తున్నారు తెలియాల్సి ఉంది. మొత్తానికి భారీ స్కెచ్ కు మరోసారి ఉగ్ర మూకలు పన్నాగం పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలుతోంది.

Related Posts