జయశంకర్ భూపాలపల్లి జూలై 02, ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు శుభాకాంక్షలు రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్.
ఈ నెల 23 వ తేదీన జపాన్, టోక్యోలో జరిగే ఒలంపిక్స్ క్రీడలకు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులకు, అందులో పాల్గొనే భారతీయులకు రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఒలంపిక్స్ లో భారతీయులు అనేక పథకాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని, దేశ ప్రతిష్టను పెంచాలని ఆకాంక్షించారు.