YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

డిజిటల్ మాల్ ఖాన్ ప్రారంభం

డిజిటల్ మాల్ ఖాన్ ప్రారంభం

నర్సీపట్నం
డిజిటల్  విధానాలను అందిపుచ్చుకోవడంలో పోలీస్ శాఖ మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే  మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ యాప్  ప్రవేశపెట్టగా తాజాగా  పలు కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను భద్రపరిచే విషయమై డిజిటల్ టెక్నాలజీని వినియోగించ బోతోంది. దీనిని ఇప్పటికే  ఉత్తరాది రాష్ట్రాల్లో అమలు చేస్తుండగా తాజాగా రాష్ట్రంలో నే తొలిసారిగా విశాఖ జిల్లాలోని నర్సీపట్నం మోడల్  పోలీస్స్టేషన్ నుంచి ఈ సేవలను రూరల్ యస్.పీ కృష్ణారావు చేతుల మీదుగా  ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ   పలు కేసుల్లో నిందితుల నుంచి స్వాధీన పరుచుకున్న  వస్తువులను ఇంతవరకు  సాధారణ పద్ధతిలో భద్రపరిచేవారమన్నారు. అయితే ప్రస్తుతం అమల్లోకి వచ్చిన ఈ - మల్ఖానా  నూతన  విధానం ద్వారా భద్ర పరిచే వస్తువులకు ప్రత్యేకంగా క్యూ ఆర్ కోడ్  ఇవ్వబడుతుందన్నారు. దీనివల్ల ఆయా సమయాల్లో న్యాయ స్థానాల్లో హియరింగ్ వచ్చే కేసులకు సంబందించి అప్పట్లో స్వాధీనం చేసుకున్న వస్తువులను అందించేందుకు సులభతరం అవుతుందన్నారు. దీనిని నెలరోజుల పాటు నర్సీపట్నంలో పరిశీలించి వచ్చిన ప్రతిఫలాల ఆధారంగా   విశాఖ రూరల్  జిల్లాలో అనకాపల్లిలో కూడా ఏర్పాటు చేస్థామని  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భవిష్యత్తులో  దీన్ని రాష్ట్ర మంతటా  విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని  రూరల్ యస్.పీ కృష్ణారావు  తెలియచేశారు.
అనంతరం విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తీగెలమెట్ట ఎంకౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు ఈ రోజు తలపెట్టిన బంద్ విఫలమైందని వారికి ప్రజలు ఎవరూ సహకరించ లేదని,ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని,మావోయిస్టులు ఎవరైనా స్వచ్ఛందంగా లొంగిపోయినట్లయితే వారి మనుగడకు ప్రభుత్వం తరపున అన్ని విధములా వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియచేశారు. కార్యక్రమంలో నర్సీపట్నం  ఏ.ఎస్పీ తుహిన్ సిన్హా, పట్టణ సీఐ స్వామి నాయుడు ,రూరల్ సి.ఐ శ్రీనివాసరావు ఎస్. ఐ లు,పోలీసు సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Related Posts