YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కత్తి మహేష్ చికిత్స!

కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కత్తి మహేష్ చికిత్స!

కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కత్తి మహేష్ చికిత్స నిమిత్తం అపోలో హాస్పిటల్స్, చెన్నై కి పదిహేడు లక్షలను CMRF క్రింద విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

కత్తి మహేష్ కోలుకొని క్షేమంగా తిరిగి రావాలనే మెగా ఫాన్స్ తోసహా అందరు కోరుకుంటున్నారు. అయితే, కత్తి మహేష్ చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చినట్లు? కత్తి మహేష్ టివి డిబేట్లలో కూచుని అవాకులు చవాకులు మాట్లాడటం తప్పితే ఆయన ప్రత్యేకత ఏమిటి? హిందువుల మనోభావాలు గాయపడేలా వ్యాఖ్యలు చేసి తెలంగాణా ప్రభుత్వంచే రాష్ట్ర బహిష్కరణకు గురైన వ్యక్తికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి?. ప్రజాధనాన్ని సద్వినియోగపడేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.  మహేష్ కళ్ళకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు అంటున్నారు. సంతషం. కళ్ళది ఏముంది? దృక్పదం లోనే నిష్పాక్షిక ధోరణి అవసరం. 

(ముఖ్యంగా విమర్శకుణ్ని అని చెప్పుకునే మహేష్ వంటి వారికి ) కత్తి మహేష్ త్వరగా కోలుకొని కొత్త జీవితాన్ని హేతుబద్దంగా సాగిస్తాడని ఆకాంక్షిస్తున్నాo.

Contribution: P.V.Rama Mohana Naidu

Related Posts