రాజమండ్రి
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేకుండా నీటి నిల్వలలో ఉమ్మడి వాటాదారులైన పక్క రాష్ట్రానికి కనీసం సమాచారం లేకుండా తెలంగాణా ప్రభుత్వం బరితెగించి విద్యుత్ ఉత్పాదన కు తెగబడుతుందంటే ఎవరి ధైర్యంతో మద్దతు తో ఇదంతా చేస్తుందో అర్ధం చేసుకోలేని అమాయకులు కాదు ఆంధ్రా ప్రజానీకం అని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. జగన్ కె.సి.ఆర్ రాజకీయ లాలూచి కుస్తీలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దగా చేస్తున్నారు ముఖ్యంగా వ్యవసాయరంగం కుదేలు అయిపోతుంది తాగునీటికి కూడా ప్రజలు ముఖ్యంగా సీమ వాసులు కటకటలాడే పరిస్థుతులు వస్తున్నాయి తెలంగాణా రాష్ట్రం లో విద్యుత్తు లోటు పెద్దగ లేనప్పటికీ ఇప్పటికిప్పుడు ఇంత ఉద్రిక్తతలు సృష్టించి శ్రీశైలం సాగర్ పులిచింతల వద్ద విద్యుత్ ఉత్పాదనకు తెలంగాణా రాష్ట్రం పూనుకోవలసిన అవసరంలేదని అన్నారు.
ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయనే వార్తల నేపద్యంలో రెండు తెలుగు రాష్టాల ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని కేసీఆర్ ప్రయత్నిస్తుంటే దానికి జగన్ పరోక్షంగా మద్దత్తు ఇచ్చి ఆంధ్రరాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి కేసీఆర్ కి దక్షిణ చెల్లించుకుంటూ అంతఃపుర పోరుని కూడా తుడిచివేయడానికి అవకాశంగా తీసుకుంటున్నాడని అన్నారు.
అందులో భాగమే రాష్ట్ర విభజన సమయంలో కాని తరువాత కాని వైఎస్సార్ ఊసు ఎత్తని తెరాస శ్రేణులు ఇప్పుడు వైఎస్సార్ పై దుమ్మెత్తి అతని బొమ్మతో రాజకీయ రంగ ప్రవేశం చేద్దామని ఆశతో ఉన్న షర్మిళ కు తెలంగాణాలో రాజకీయ వేదిక లేకుండా చేసే పనిలో ఈ కొత్త రచ్చకి తెరతీశారని అన్నారు.