YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

వృద్ధి బాటలో పయనిస్తున్న భారత్ ఎగుమతులు: పీయూష్ గోయల్

వృద్ధి బాటలో పయనిస్తున్న భారత్ ఎగుమతులు: పీయూష్ గోయల్

న్యూఢిల్లీ జూలై 2
 భారత దేశ ఆర్థిక వ్యవస్థ, ఎగుమతులు వృద్ధి చెందుతున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. కోవిడ్-19 రెండో ప్రభంజనం తీవ్రంగా ఉన్నప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ, ఎగుమతులు వృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అత్యధిక ఎగుమతులు నమోదైనట్లు చెప్పారు. పీయూష్ గోయల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఎగుమతులు వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అత్యధికంగా 95 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగినట్లు చెప్పారు.  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి వేధిస్తున్నప్పటికీ, 2020-21లో అత్యధిక స్థాయిలో 81.72 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయని తెలిపారు. 2021 ఏప్రిల్‌లో 6.24 బిలియన్ డాలర్లు ఎఫ్‌డీఐ వచ్చినట్లు తెలిపారు. పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) గుర్తించిన స్టార్టప్ కంపెనీల సంఖ్య 50 వేలకు చేరిందన్నారు. దేశంలోని 623 జిల్లాల్లో ఈ స్టార్టప్‌లు ఉన్నాయన్నారు. ఇంజినీరింగ్, వరి, నూనెలు, సముద్ర సంబంధిత ఉత్పత్తుల రంగాల్లో ఆరోగ్యవంతమైన వృద్ధి కనిపిస్తోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరగాలనే లక్ష్యాన్ని సాధించేందుకు సంబంధిత వర్గాలతో కలిసి కృషి చేస్తామని చెప్పారు.

Related Posts