హైదరాబాద్ జూలై 2
సాల్వ్ ఈ డిజిటల్ ద్వారా గుమ్మం దగ్గరకే సరుకుల బట్వాడా ఆత్మనిర్భర్‌గా మారుతున్న భారతదేశపు సూక్ష్మ & చిన్న తరహా వ్యాపారాలు
సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాలు చాలా కాలం క్రితమే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా గుర్తింపు పొందాయి. వ్యవసాయ రంగం తరువాత రెండవ అతి పెద్ద ఉద్యోగకల్పనా రంగంగా, భారతదేశపు జిడిపికి 30% వాటాను అందిస్తూ, దేశ అభివృద్ధిలో ఒక గణనీయమైన పాత్రను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ) రంగం పోషిస్తోంది, భారతదేశ ప్రగతిలో, సంపన్నతలో కీలకమైన భాగంగా ఉంది.
కొవిడ్-19 మహమ్మారి, జాతీయ, రాష్ట్ర స్థాయి లాక్‌డౌన్ లాంటి తదనంతర చర్యలు ఈ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి, సూక్ష్మ & చిన్న తరహా వ్యాపారాల యజమానులు తమ వ్యాపారాలు దారుణంగా దెబ్బతినడంతో ఈ ప్రభావంలో చిక్కుకున్నారు. సరుకులు అమ్ముడు కాకపోవడం, భౌతిక దూరం కారణంగా దుకాణాలకు వ్యక్తుల రాలేకపోవడం లాంటి వాటి ఫలితంగా విక్రయాలు పడిపోవడంతో వాళ్ళు ఇబ్బందులకు గురయ్యారు. ఈ సంక్షోభం నుంచి మనుగడ నిలబెట్టుకోవడానికి తమ వ్యాపార నమూనాలను మార్చుకోవడం, ఒక ఆన్‌లైన్ ఉనికిని అభివృద్ధి చేసుకోవడం కీలకమని వాళ్ళు అప్పుడే భావించారు. తక్కువ సాంకేతికత కలిగిన ఎస్ఎంఇల కన్నా కొత్త సాంకేతికతను అవలంభించిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో (ఎస్ఎంఇల్లో) 10 పాయింట్లు ఎక్కువ ఉద్యోగ వృద్ధి, 11 పాయింట్ల ఎక్కువ ఆదాయ వృద్ధీ ఉన్నట్టు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బిసిజి) చేసిన పరిశోధన చెబుతోంది. డిజిటల్ సరఫరా గొలుసుకట్టు & దాని ప్రయోజనాల గురించి కొవిడ్-9 తమలో అవగాహన పెంచిందనీ, తమ వ్యాపారాలను మెరుగు పరుచుకోవాలంటే తమకు సరుకుల శ్రేణి కదలికలో & నిర్వహణలో పారదర్శకత అవసరమనీ 75% కు పైగా చిల్లర వ్యాపారులు ఈ రోజు చెబుతున్నారు. లాక్‌డౌన్ కాలంలో బేరసారాలు & విక్రయాల్లో, సరఫరా గొలుసుకట్టులో తమ సరుకులను సేకరించడానికీ & విక్రయించడానికీ అధికశాతం మేరకు వీడియోకాల్స్, ఛాట్స్ ఆన్‌వైన్ ద్వారానే ఎంఎస్ఎంఇల మధ్య జరిగాయి, బి2బి యాప్స్ & వెబ్‌సైట్స్ లోనే 30 %+ లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి, ఈ ధోరణి కొనసాగుతుంది.
డిజిటలైజేషన్‌ను అందిపుచ్చుకొని, ఆన్‌లైన్‌లోకి వెళ్ళి, ఉత్పత్తుల ధరల నిర్ధారణ & నాణ్యతల సాధికారత విషయంలో గణనీయమైన ప్రయోజనాన్ని పెరుగుతున్న కొనుగోలుదార్ల డిమాండ్ ద్వారా ఎంఎస్ఎంఇలు పొందుతున్నాయి, ఈ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటున్నాయి & చిన్న & సూక్ష్మ అమ్మకందార్ల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. విక్రయదార్లు, తయారీదార్లు, టోకువర్తకులు, పంపిణీదారుల్లాంటి అమ్మకందార్ల విషయంలో, సాల్వ్ లాంటి ప్యూర్‌ప్లే, జీరో-ఇన్వెంటరీ డిజిటల్ మార్కెట్ ప్లేస్ ధ్రువీకృతమైన కొనుగోలుదార్లతో కూడిన విశ్వసనీయమైన పర్యావరణ వ్యవస్థను అందిస్తున్నాయి- నిజమైన వినియోగదారులతో వారు వ్యవహరించేలా, మోసాల నించి సురక్షితంగా ఉండేలా చూస్తున్నాయి. కొత్త మార్కెట్లనూ, వినియోగదార్లనూ వారు చేరుకొనే విస్తృతిని ఇది పెంచుతుంది, ఎందుకంటే వాణిజ్యానికి భౌతిక దూరం ఏమాత్రం అవరోధం కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా, సాల్వ్ లాంటి ఒక ప్యూర్‌ప్లే మార్కెట్ ప్లేస్ సరఫరా గొలుసుకట్లకు ఏమాత్రం విఘాతం కలిగించదు & పర్యావరణ వ్యవస్థ నుంచి ఈ చిన్న వ్యాపారులను తొలగించే ముప్పును ఏమాత్రం కలిగించదు- వాళ్ళు వారితో పని చేస్తారు & మొత్తం ఎంఎస్ఎంఇ సరఫరా గొలుసుకట్టును డిజిటలైజ్ చేసి & మెరుగుపరిచే క్రమంలో వాణిజ్యంలో వారికి ప్రమేయం కల్పిస్తారు.
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం కావడం ద్వారా, ఈ చిన్న తయారీదార్లు, విక్రయదార్లు & సరఫరా దార్లకు రుణాలు అవసరమైనప్పుడు, సకాలంలో రుణాలను కూడా ఎంఎస్ఎంఇలకు సాల్వ్ లాంటి ఇ-కామర్స్ మార్కెట్ ప్లేస్‌లు అందుబాటులోకి తెస్తాయి. ఒకవేళ నగదు ప్రవాహానికి సంబంధించిన సవాళ్ళు ఉన్న వారు వాటిని అధిగ మించడానికీ లేదా తమ వ్యాపారాల స్థాయిని పెంచుకోవడానికి అవసరమైన వృద్ధి పెట్టుబడికింద వారు ఉపయోగించుకోవడానికీ ఇది సాయపడుతుంది. సేకరణ, బిల్లింగ్, చెల్లింపుల్లాంటి తమ ప్రక్రియలను పటిష్టం చేసుకోవడానికీ, క్రమబద్ధీకరించుకోవడానికీ వారి కార్యకలాపాల డిజిటలీకరణ సాయపడుతుంది, అలాగే పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా వాటిని రూపొందించుకోవడానికి. తమ సామర్థ్యాలను పెంచుకోవడానికీ దోహదపడుతుంది. అంతిమంగా వాటిలో, వ్యాపార వృద్ధికి దారి తీసే మరింత నాణ్యతా స్పృహ, పోటీ తత్వాలు కలిగేలా చేస్తుంది.
ఆనాటి పర్యావరణ వ్యవస్థలో ప్యూర్‌ప్లే మార్కెట్ ప్లేస్ నమూనాల ఆవశ్యకత గురించి, అమిత్ బన్సాల్, సిఇఓ, సాల్వ్, మాట్లాడుతూ “ప్యూర్‌ప్లే డిజిటల్ మార్కెట్ ప్లేస్‌లు మొత్తం సరఫరా గొలుసుకట్టును పటిష్టం చేయడంలో అనేక విధాలుగా ఒక ఉత్ర్పేరకంగా పని చేస్తాయి, అంతిమంగా ఆత్మనిర్భరతతో కూడిన బలమైన ఎంఎస్ఎంఇల సృష్టికి దారి తీస్తాయి. సాల్వ్ లాంటి మార్కెట్ ప్లేస్‌లు అందించే ఆర్థిక & సాంకేతిక, వనరుల ప్రజాస్వామికీకరణల విజయవంతమైన సమ్మేళనం ద్వారా ఇది సాధ్యం. ఆన్‌లైన్ చెల్లింపులు, లాజిస్టిక్ సపోర్ట్, డేటా అనలటిక్స్ లాంటి వ్యవస్థల సమానమైన అందుబాటును ప్రతి ఒక్కరికీ మేము అందిస్తాం, వినియోగదారులను అర్థం చేసుకొని, నిమగ్నం చేసి, కొనసాగించుకోవడానికీ, ఆదాయాల వృద్ధికి దారి తీయడానికీ ఇది ఉపయోగపడుతుంది. ఒక ప్యూర్ మార్కెట్ ప్లేస్ నమూనాగా, ఈ దేశంలో 6 కోట్ల యాభై లక్షల పైచిలుకు ఎంఎస్ఎంఇల జీవనాలను మెరుగు పరచడం అనే మా ప్రధాన లక్ష్యానికి మేము కట్టుబడి ఉంటాం.” ఫాస్ట్-మూవింగ్ వినియోగ వస్తువుల (ఎప్ఎంజిసి) రంగానికి భారతదేశంలో 500 బిలియన్ అమెరికన్ డాలర్ల అవకాశం ఉంది; ఈ రంగం సామర్థ్యాలను, దాన్ని ఎలాంటి అంతరాయం కలిగించకుండా పెంచడం ద్వారా దాని సామర్థ్యాలను సాకారం చెయ్యడంలో సాల్వ్ లాంటి డిజిటల్ మార్కెట్ ప్లేస్‌లు సాయపడతాయి.
ఐడిఫ్రెష్ ఫుడ్ లాంటి ఫుడ్ ప్రాసెసింగ్ తయారీదార్ల లాంటి ప్రసిద్ధమైన కొనుగోలుదార్లతో వారి వ్యాపారాల్లో గణనీయమైన వృద్ధిని సాల్వ్ లాంటి మార్కెట్ ప్లేస్‌లలో విక్రయదారులు ఇప్పటికే గమనించారు, అనేక పెద్ద హోటళ్ళు, రెస్టారెంట్లు తమ అవసరాలకు వనరుగా ఈ వేదికను ఉపయోగించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో అతి పెద్ద మధ్యాహ్న భోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్న అక్షయపాత్ర లాంటి ఎన్‌జివోలు, అణగారిన వర్గాల వారికి రేషన్ కిట్లు & దుస్తులు అందిస్తున్న గోంజ్ కూడా సాల్వ్ నుంచే కొనుగోలు చేస్తున్నాయి. వ్యాపారాలను నిర్వహించడంలో ఒక డిజిటల్ నమూనాను అనుసరించకపోవడం వల్ల తమకు అందుబాటులో లేని ఇలాంటి పెద్ద కొనుగోలుదార్లకు విక్రయం చెయ్యడం ద్వారా ఎప్ఎంసిజి రంగంలోని అనేక మంది చిన్న విక్రయదారులు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. సాల్వ్ లో విక్రయాలు ప్రారంభించిన అనేక మంది చిన్ నవ్యాపారాల యజమానులు ప్రతి నెలా ఈ ప్లాట్‌ఫారమ్ మీద కోట్ల విలువైన సరుకులను విక్రయించి త్వరగా పురోగతి సాధిస్తున్నారు, తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు.
బియ్యం, గోధుమపిండి లాంటి సరుకులను విక్రయించే కెసి ట్రేడర్స్ కు ప్రొప్రయిటర్, ఆయన ఢిల్లీ కేంద్రంగా ఉన్న చిన్న వ్యాపారానికి యజమాని, ఆయన ఇప్పటికి ఏడాదికి పైగా సాల్వ్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకుంటున్నారు. “కొనుగోలుదార్లకు నా అందుబాటును విస్తరించే ఒక పెద్ద అవకాశాన్ని సాల్వ్ నాకు అందించింది, ఇంతకుముందెన్నడూ లేని స్థాయికి పెంచింది” అని ఆయన చెప్పారు. “ఇంతకుముందు నేను కేవలం కొన్ని వందల మందికి మాత్రమే చేరువయ్యేవాణ్ణి, ఇప్పుడు ప్లాట్‌ఫారమ్‌మీద 50,000కు పైగా కొనుగోలుదార్లకు నేను చేరువయ్యాను. ఇది నా విక్రయాలనూ, మార్జిన్లనూ బ్రహ్మండంగా మెరుగుపరిచింది. ఇటీవలి కొవిడ్ మహమన్మారి పరిస్థితుల్లో, ఇ-కామర్స్ నూ, సాల్వ్ లాంటి ఒక డిజిటల్ మార్కెట్ ప్లేస్‌నూ ఆశ్రయించడం మినహా మీ వ్యాపారాభివృద్ధికి మరో మార్గం లేదు” అని మోహిత్ చెప్పారు.
బెంగళూరులో, హోమ్ కేర్ ఉత్పత్తులు, కాస్మొటిక్స్, ఆహార, పానీయ వస్తువులను విక్రయించే మంథా ఫుడ్ కంపెనీకి చెందిన దేవేంద్ర కూడా తన అనుభవాలను ఘనంగా పంచుకున్నారు. ఆయన సాల్వ్ ను ఒక ఏడాదిగా ఉపయోగిస్తున్నారు, ఆయన చేరినప్పటి కన్నా 200 శాతం వ్యాపార వృద్ధిని ఆయన సాధించారు. “ఇంతకుముందు, నా దుకాణానికి దగ్గర్లో ఉన్నవారికి మాత్రమే విక్రయాలు చేయగలిగేవాణ్ణి; ఇప్పుడు నగర వ్యాప్తంగా కొనుగోలుదార్లకు నేను విక్రయాలు చేస్తున్నాను. నా విస్తృతి పెరిగింది, వ్యాపారంలోని అన్ని విభాగాలూ ఇప్పుడు క్రమబద్ధమయ్యాయి” అని దేవేంద్ర చెప్పారు. “బిల్లింగ్, చెల్లింపులూ, ప్రతిదీ ఇప్పుడు ఆటోమెటెడ్‌గా జరుగుతోంది, దీన్నంతట్నీ అయిదు నుంచి పది మంది పనివాళ్ళతో నేను నిర్వహించగలుగుతున్నాను, ఇంతకుముందు ప్రతిదాన్నీ నిర్వహించడానికి చాలా ఎక్కువ మంది మనుషులు నాకు అవసరమయ్యేవాళ్ళు. కాబట్టి, నా ఖర్చులు కూడా తగ్గాయి” అని ఆయన చెప్పారు. సాల్వ్ ద్వారా అత్యంత లాభసాయి అయిన విషయంగా ఆయన గుర్తించింది సౌకర్యం, ఈ ప్లాట్ ఫారమ్ ఒకే యాప్ ద్వారా భిన్నమైన తన ఉత్పత్తుల్ని విక్రయించే వీలు కల్పిస్తోంది, సరుకుల రవాణా నుంచి వినియోగదారుడికి బట్వాడా స్థితి గురించి సకాలంలో అప్రమత్తం చెయ్యడం, సకాలంలో చెల్లింపులు జరగడం వరకూ- ఎండ్-టు-ఎండ్ సేవలను అందిస్తోంది. దేవేంద్ర ఒక పూర్తిస్థాయి ఆన్‌లైన్ వ్యాపార నమూనాకు మారిపోయారు, ఎందుకంటే భవిష్యత్తు ఇక్కడే ఉందని ఆయన నమ్ముతున్నారు.
హైదరాబాద్‌కు చెందిన విక్రయదారు, శ్రీ సాయి ట్రేడర్ ప్రొప్రయిటర్ రాకేష్ బియ్యం, నూనెలు, పప్పు దినుసుల్లాంటి నిత్యావసరాలు విక్రయిస్తారు. ఆయన ఆన్‌లైన్‌కు వెళ్ళాలనీ, సాల్వ్ లాంటి డిజిటల్ మార్కెట్ ప్లేస్‌ను ఉపయోగించాలనీ నిర్ణయించుకున్నారు, ఎందుకంటే తన వ్యాపారం కోటం అది ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని ఆయన చూశారు. “ఆన్‌లైన్‌కు వెళ్ళడం, ఒక డిజిటల్ మార్కెట్ ప్లేస్‌ను ఉపయోగించడం నా విక్రయాలను పెంచింది. ఇంతకుముందుతో పోలిస్తే, నాకు ఇప్పుడు అతి పెద్ద కొనుగోలుదార్ల పునాది ఉంది. సాధ్యమైనంత ఉత్తమ ధరలకు సరుకులను మేం అందించగలుగుతున్నాం, అది మా వినియోగదారుల పునాదిని చుకోడానకి మాకు దోహదపడుతోంది” అని రాకేష్ చెప్పారు.
బి2బిలో సాల్వ్ లాంటి ఇ-కామర్స్ మార్కెట్ ప్లేస్‌లు సాంకేతికతను ఉపయోగించి, ఎంఎస్ఎంలఇల వృద్ధిలో సవాళ్ళను అధిగమించడానికీ, నిజమైన “ఆత్మనిర్భర్”గా మారడానికి సాయపడతాయి. బి2బి ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ రంగం లాభదాయక సంభావ్యత చాలా ఎక్కువ; ఒక రెడ్ సీర్స్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశ బి2బి ఇ-కామర్స్ మార్కెట్ ప్రపంచంలోనే అతి వేగంగా వృద్ధి చెందుతున్న వాటిలో ఒకటి, సిఎజిఆర్ వృద్ధిని ఇది 80%గా చూపించింది, దీనిలో అత్యధిక భాగం బి2బి రంగం నుంచి, ఆహారం, పచారీ సరుకుల విభాగాల ద్వారా వస్తుందని అంచనా.
ఎఫ్ఎజి పరిశ్రమలో, దుస్తులు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ &హోరెకా లాంటి ఇతర కీలక రంగాల్లో అవి ఎదుర్కొంటున్న సవాళ్ళను ఎదుర్కొనడం కోసం ఎంఎస్ఎంఇ రంగంతో సన్నిహితంగా సాల్వ్ పని చేస్తోంది. కొవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో వాటికి సాయపడడం కోసం, క్రెడిట్ హెల్ప్ లన్లను ఏర్పాటు చేయడం లాంటి చర్యలను సాల్వ్ తీసుకుంటోంది, బి2బి రంగంలో ఇప్పుడు కొనండి, తరువాత చెల్లించండి (బిఎన్‌పిఎల్) లాంటి ఒక మార్గదర్శక కార్యక్రమాన్ని ప్రారంభించింది, డీలర్/ పంపిణీదార్ల ఫైనాన్స్ ఆసరాగా డీప్-టైర్ యాంకర్‌కు మద్దతుగా సరఫరా గొలుసుకట్టు ఆర్థిక వేదికను ఏర్పాటు చేసింది, గుమ్మం దగ్గరకే సరుకుల బట్వాడాను అందిస్తోంది. చిన్న వ్యాపార యజమానులు, విక్రయదారులు తమ వ్యాపారాలను వృద్ధి చేసుకొనే అవకాశాన్ని అందిపుచ్చుకొని, సిసలైన ఆత్మనిర్భర్‌గా మారడానికి అత్యంత అనువైన ఎంపికగా సాల్వ్‌ను ఈ డిజిటల్ పరిష్కారాల సమ్మేళనం రూపొందిస్తోంది.