హైదరాబాద్ జూలై 2
అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు వన్యప్రాణుల అధ్యయనం ఎంతో ప్రాముఖ్యతను వహిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అదేవిధంగా జూనోటిక్ వ్యాధులను అర్థం చేసుకునేందుకు, అంచనా వేసేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు. హైదరాబాద్ అత్తాపూర్‌లోని సీసీఎంబీ లాకోన్స్ జంతు పరిశోధనశాలను ఉపరాష్ట్రపతి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మినీ జంతు ప్రదర్శనశాలను వీక్షించారు. రాతి కట్టడాలను పరిరక్షించేలా నిర్మించిన భవన సముదాయంను పరిశీలించారు. శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులతో ఉపరాష్ట్రపతి సమావేశమయ్యారు.