YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

రష్యాలో డెల్టా దడ

రష్యాలో డెల్టా దడ

మాస్కో, జూలై 2, 
రష్యాలో డెల్ట్ వేరియంట్ క‌ల‌వ‌రం సృష్టిస్తోంది. ఆ దేశంలో మ‌ళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వ‌రుస‌గా నాలుగ‌వ రోజు ఆ దేశంలో అత్య‌ధిక మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. గ‌త 24 గంట‌ల్లో 679 మంది వైర‌స్‌తో చ‌నిపోయిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. ర‌ష్యాలో క‌రోనాతో అత్య‌ధిక మ‌ర‌ణాలు సంభ‌వించిన అయిదో దేశంగా నిలిచింది. డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ మ‌రోసారి దేశ ప్ర‌జ‌ల‌ను వ్యాక్సిన్ వేసుకోవాల‌ని కోరారు. సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లో శుక్ర‌వారం అత్య‌ధికంగా 101 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌ర‌ణాల సంఖ్య అధికంగా ఉన్నా.. యూరో క‌ప్‌లో భాగంగా స్పెయిన్ వ‌ర్సెస్‌ స్విట్జ‌ర్లాండ్ మ్యాచ్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ల‌ను మాత్ర‌మే మాస్కో రెస్టారెంట్ల‌కు అనుమ‌తి ఇస్తున్నారు. సెప్టెంబ‌ర్ నాటికి 60 శాతం ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ ఇవ్వాల‌ని ర‌ష్యా నిశ్చ‌యించింది. క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ష్యాలో 1,36,565 మంది మృతిచెందారు.

Related Posts