YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

సూర్యాపేట
తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండల కేంద్రంలోని శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి వర్షాకాలం పంట సాగు కొరకు తుంగతుర్తి శాసనసభ్యుడు లు డా.గాదరి కిశోర్ కుమార్  నీటిని విడుదల చేసినారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంట లక్ష్మమ్మ రాములు, జెడ్పిటిసి ఎర్ర రణీల యాదగిరి,మార్కెట్ చైర్పర్సన్ కట్ట లక్ష్మీ వెంకట్ రెడ్డి, పీయేసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ గుండా శ్రీనివాస్,మార్కెట్ వైస్ చైర్మన్ శేఖర్ బాబు,మండల పార్టీ అధ్యక్షుడు ఐతగోని వెంకన్న మరియు ప్రజాప్రతినిధులు,నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  తెలంగాణ ప్రభుత్వం సాగునీటి,త్రాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.  తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించడమే కేసీఆర్ లక్ష్యమని అన్నారు.  సీఎం కేసీఆర్ ముందుచూపు ఆలోచనతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో బీడు బారిన భూములన్నీ పచ్చని పంటపొలాలతో కలకళలాడుతున్నాయన్నారు.  రైతులు లాభాసాటి వ్యవసాయం పై దృష్టిపెట్టేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.  మార్కెటింగ్ను దృష్టిలో పెట్టుకొని డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా రైతుల ఆదాయాలను పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు.  ముందస్తూ ప్రణాళికతో మిషన్ కాకతీయ ద్వారా చేరువులన్ని పునరుద్ధరణ చేసుకోవడం జరిగింది.   రైతులకు పుష్కలంగా నీళ్లు,రైతు బంధు సాయం,గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతుంది.  గతంలో 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో 1,15,625 ఎకరాల్లో వరి పంటను సాగుచేస్తున్నారు.   నేడు శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి  పంట సాగు కొరకు నీటిని విడుదల చేయడం వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. - రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు.

Related Posts