YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తొలిసారిగా ఆన్ లైన్ లో తెలంగాణ ఎంసెట్

తొలిసారిగా ఆన్ లైన్ లో తెలంగాణ ఎంసెట్

తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది. నేటి నుంచి  ఈ నెల 7 వరకు ఎంసెట్ పరీక్షలు కొనసాగనున్నాయి. ఎంసెట్ పరీక్షలకు తెలంగాణతో పాటు ఏపీలోనూ కేంద్రాలను ఏర్పాటు చేశారు.   తెలంగాణ వ్యాప్తంగా 8 నగరాల్లో 168 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంసెట్ పరీక్షలను 2.21 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.  తొలిసారిగా ఎంసెట్ను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తుండటంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.  నిముషం ఆలస్యమైనా పరీక్ష హాలులోనికి అనుమతించలేదు.  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి బ్యాచ్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండో బ్యాచ్ నిర్వహిస్తున్నారు.

ఈసారి అగ్రికల్చర్ పరీక్ష మొదట ప్రారంభం అయింది.  ఈనెల 6న నీట్ ఉన్నందున ఆ రోజు ఎంసెట్ ఉండదు. ఒక్కో విడతకు సుమారు 28 వేలమంది పరీక్షలు రాస్తారు. అగ్రికల్చర్కు 75 పరీక్ష కేంద్రాలు, ఇంజినీరింగ్కు 83 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంజినీరింగ్కు లక్షా 47,912 మంది, అగ్రికల్చర్కు 73,078 మంది దరఖాస్తు చేశారు. ఏపీలో కర్నూల్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణాల్లో కూడా పరీక్ష జరగనుంది. విద్యార్థుల నుంచి బయోమెట్రిక్ హాజరు తీసుకోవాల్సి ఉన్నందున పరీక్ష 10 గంటలకు ప్రారంభమవుతున్నా ఉదయం 8 గంటల నుంచి లోపలికి అనుమతి ఇస్తారు. బయోమెట్రిక్ హాజరు అనంతరమే ప్రతి ఒక్కరికి పాస్వర్డ్ ఇస్తారు. ఏ కంప్యూటర్ వద్ద కూర్చోవాలో చెబుతారు. ఆ పాస్వర్డ్తో కంప్యూటర్లోకి లాగిన్ కావాలి. ప్రతి 30 మందికి ఒక బయోమెట్రిక్ పరికరం ఏర్పాటు చేసారు. పరీక్ష మధ్యలో బయోమెట్రిక్ హాజరు తీసుకోవడం ఉండదని అధికారులు స్పష్టం చేసారు.  

Related Posts