శ్రీశైలం డ్యాం లో తెలంగాణ విథ్యుత్ ఉత్పత్తి వెంటనే నిలిపివేయాలి రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ డిమాండ్.
కర్నూలు నగరంలో కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహం ముందు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. శనివారం నాడు నంద్యాల నుండి రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ,,కృష్ణా, తుంగభద్ర, నదుల లో అక్రమ ప్రాజెక్టులు అరికట్టాలి, శ్రీశైలం డ్యాంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలి ,,రాయలసీమ కరువు ను తీర్చేందుకు 400 టిఎంసి జలాలు కేటాయించాలని ,,కృష్ణ రివర్ బోర్డు కర్నూల్ లో ఏర్పాటు చేయాలి ,,రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ డిమాండ్ చేశారు. శ్రీశైలం డ్యాం లో తెలంగాణ వారు విథ్యత్ ఉత్పత్తి అపకుంటే శ్రీశైలం డ్యాం ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీనిపై మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే కలుగ చేసుకుని రాయలసీమ రైతులకు అన్యాయం జరుగ కుండా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వంకిరి రామచంద్రుడు పాల్గొన్నారు.