YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ

గ్రూప్-1, 2,3 సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలి... నిరుద్యోగుల సమావేశం డిమాండ్

గ్రూప్-1, 2,3  సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలి...  నిరుద్యోగుల  సమావేశం  డిమాండ్

హైదరాబాద్ జూలై 4,
గ్రూప్-1, 2,3  సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలని,  రాష్ట్ర ప్రభుత్వం అధికారులు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా క్రింద భర్తీ చేయవలిసిన  గ్రూప్-1,2,3,,4 సర్వీస్ ఉద్యోగాలను సరిగ్గా పూర్తి స్థాయిలో లెక్కించి – గణన చేసి భర్తీ చేయడానికి ప్రతిపాదనలు పంపాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య నిరుద్యోగ సమావేశంలో  డిమాండ్  చేశారు.  నిరుద్యోగ జాక్ చైర్మన్ నీల వెంకటేష్ అద్యక్షతన జరిగిన ఈ సమావేశం లో నిరుద్యోగ జాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నమల్ల నాగరాజు, జాతీయ ఉపాద్యక్షులు గుజ్జ  తదితరులు పాల్గొని ప్రసంగించారు.గ్రూప్-1 సర్వీస్ కింద గత 10 సంవత్సరాలుగా పోస్టుల భర్తీ చేయడం లేదు. అలాగే గ్రూప్-2 సర్వీస్ కింద 5 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లో పూర్తి స్థాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట భర్తీ చేయకుండా నామమాత్రంగా భర్తీ చేశారు. అందుకే ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా లెక్కించాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమం లో, పగడాల సుధాకర్, చంటి ముదిరాజ్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్  లాల్ కృష్ణ, MBC రాష్ట్ర అద్యక్షులు నిమ్మల వీరన్న  తదితరులు పాల్గొన్నారు.   

Related Posts