విజయవాడ, జూలై 5,
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే ఆయన ఒకరు. వైఎస్ వల్లనే తాను రాజకీయంగా ఇంతటి వాడయ్యానని చెప్పుకుంటే తిరిగే ఆయన మరొకరు.కానీ వైఎస్ వల్ల అంత లబ్దిపొందిన వీరిద్దరూ ఈ సమయంలో మాత్రం నోరు మెదకపకపోవడం విమర్శలకు తావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ఒక అధ్యాయం. ఆయన అలా వచ్చి ఇలా వెళ్లిపోయరు. దశాబ్దాలుగా రాజకీయాలు చేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ ఒక వెలుగు వెలిగారువైఎస్ అంటే తొలుత గుర్తుకు వచ్చేది కేవీపీ రామచంద్రరావు. వైఎస్ ఆత్మగా ఈయనకు పేరు. అధికారంలో ఉన్నప్పుడు షాడో సీఎంగా కూడా వ్యవహరించేవారు. వైఎస్ పుణ్యమా అని రాజ్యసభ పదవి దక్కింది. వైఎస్ మరణానంతరం కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. ఆయన ప్రస్తుతం రాజకీయంగా క్రియాశీలకంగా లేకపోయినా వైఎస్సార్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఈయన మౌనం వహించడం చర్చనీయాంశమైంది.ఇక మరో నేత ఉండవల్లి అరుణ్ కుమార్. వైఎస్సార్ పుణ్యమా అని తాను రాజకీయాల్లో ఎదిగానని చెప్పుకుంటారు. వైఎస్సార్ చలవ వల్లే ఉండవల్లి అరుణ్ కుమార్ రెండుసార్లు పార్లమెంటు సభ్యుడు అయ్యారు. వైఎస్సార్ అంటే పిచ్చి అభిమానం చూపుతారు. కాంగ్రెస్ లో లేకపోయినా ఈయన కూడా క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. వైఎస్ అంటే పడి చచ్చపోయే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా నోరు మెదపడం లేదు.వైఎస్ ను విమర్శిస్తున్నా….గత కొంత కాలంగా వైఎస్సార్ పై తెలంగాణ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నా వీరిద్దరూ మాట్లాడకపోవడంపై రాజకీయంగా చర్చ జరుగుతుంది. నీటి జగడం అయినప్పటికీ వైఎస్సార్ కు మద్దతుగా నిలిచి తెలంగాణ నేతలకు కౌంటర్ ఇవ్వాల్సిన సమయంలో వీరి మూగనోము హాట్ టాపిక్ అయింది. వైఎస్ మీద పుస్తకాలు రాసి, ఆయన వర్ధంతి, జయంతుల రోజు నివాళులర్పిస్తే సరిపోదని, ఆయనపై విమర్శలు వచ్చినప్పుడు ఖండిస్తేనే అది సరైన నివాళి అవుతుందని వీరిద్దరిని ఉద్దేశించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి.