YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అప్రూవర్ గా చెరుకూరి... నారాయణకు సినిమానే

అప్రూవర్ గా చెరుకూరి... నారాయణకు సినిమానే

గుంటూరు, జూలై 5, 
రాజధాని భూముల వ్యవహారం తెలుగుదేశం పార్టీ నేతల మెడకు చుట్టకునేలా ఉంది. ముఖ్యంగా అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణకు ఇబ్బందులు తప్పేలా లేవు. నారాయణను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నారాయణను విచారించాలని ఇప్పటికే హైకోర్టులో సీఐడీ అధికారులు పిటీషన్ దాఖలు చేశారు. అమరావతి భూముల విషయంలో నారాయణ కీలక పాత్ర పోషించారని సీఐడీ దర్యాప్తులో వెల్లడయింది.సీఆర్డీఏ చెరుకూరి శ్రీధర్ రాజధాని వ్యవహారంలో కీలకంగా మారారు. చెరుకూరి శ్రీధర్ గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా అప్పడు ఉన్నారు. ఆయనను చంద్రబాబు ప్రభుత్వం సీఆర్డీఏ కమిషనర్ ఛైర్మన్ గా నియమించారు. ఆయన నేతృత్వంలోనే రాజధాని భూముల సేకరణ జరిగింది. అప్పటి మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు దగ్గరుండి ల్యాండ్ పూలింగ్ వ్యవహారాలను పరిశీలించారు.
ఇప్పుడు తాజాగా చెరుకూరి శ్రీధర్ ను సీఐడీ అధికారులు విచారించారు. ఆయనను ఈ కేసులో సాక్షిగా సీఐడీ పేర్కొంది. ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. తుళ్లూరు మండలంలో రెవెన్యూ రికార్డులను మాయం చేశారు. ఈ మాయం వెనక కూడా నారాయణ హస్తం ఉందని భావిస్తున్నారు. తనకు తెలియంకుడానే రహస్యంగా వారు రికార్డులు తెప్పించుకున్నారని చెరుకూరి శ్రీధర్ విచారణలో వెల్లడించారు.2014లోనే రికార్డులు మాయం అయ్యాయని, ల్యాండ్ పూలింగ్ మాత్రం 2015లో ప్రారంభమయిందని చెరుకూరి శ్రీధర్ చెప్పారు. అంతే కాకుండా ఎస్సీఎస్టీ యాక్టుకు విరుద్థంగా అసైన్డ్ మెంట్ ల్యాండ్ విషయంలో జీవో 41ని తెచ్చారన్నారు. ఇది చట్టవిరుద్ధమేనని చెప్పారు. చెరుకూరి శ్రీధర్ స్టేట్ మెంట్ మొత్తం నారాయణ చుట్టూనే తిరిగింది. ఈ భూముల కుంభకోణానికి ఆయనే ప్రధాన బాధ్యుడిగా చేస్తూ ఆయన సీఐడీ అధికారులకు చెప్పడంతో నారాయణకు ఇక కష్టాలు తప్పేట్లు లేవు. నారాయణ గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Related Posts