YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి

వరంగల్‌ జూలై 5
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరామని మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు తెలిపారు. ఇప్పటికీ ప్రధాని మోదీ స్పందించడంలేదని, ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. కరోనా కష్టకాలంలోనూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు, పింఛన్లు, సంక్షేమ పథకాలను ఆపలేదని చెప్పారు. ఒకప్పుడు కరెంటు కోసం అరిగోస పడ్డామని, ఇప్పుడు 24 గంటలు కరెంటు అందుబాటులో ఉందన్నారు. జిల్లాలోని శాయంపేటలో రైతు వేదికను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. కాళేశ్వరం, దేవాదుల నీళ్లు శాయంపేట మండలానికి వస్తున్నాయని చెప్పారు. రైతులందరికీ పెట్టుబడి సాయం కింద రైతుబంధు పంపిణీ చేశామన్నారు. వరిసాగులో వెదజల్లే పద్ధతి వల్ల చాలా లాభాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్దన్నా వరి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం ఎందుకు కొనుగోలు చేస్తలేరని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఆయిల్‌పామ్‌కు డిమాండ్‌ ఉందని చెప్పారు.పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయని చెప్పారు. గ్రామపంచాయతీలకు ప్రతి నెల రూ.300 కోట్లకుపైగా నిధులు ఇస్తున్నామని వెల్లడించారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి అమలుచేయడం ద్వారా తెలంగాణలో విష జ్వరాలు దూరమయ్యాయని చెప్పారు.

Related Posts