YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పయ్యావులకు పదవీ గండం

పయ్యావులకు పదవీ గండం

అనంతపురం, జూలై 6, 
తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. క్యాడర్ లో నైరాశ్యం నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో ధైర్యం నింపాల్సిన సీనియర్ నేతలు సయితం మౌనంగా ఉంటున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించన నేతలు ఇలా మొహం చాటేస్తే ఎలా అని చంద్రబాబు నిలదీసినట్లు తెలిసింది. ముఖ్యంగా సీనియర్ నేత పయ్యావుల కేశవ్ సైలెన్స్ గా ఉండటంపై చంద్రబాబు మండిపడుతున్నారు.తెలుగుదేశం పార్టీలో పయ్యావుల కేశవ్ సీనియర్. మంచి వాగ్దాటి ఉన్న నేత. తెలుగుదేశం గతంలో విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్ ను గట్టిగా విన్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పయ్యావుల కేశవ్ పార్టీ తరుపున గట్టిగా నిలబడ్డారు. కానీ గత రెండేళ్ల నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. కనీసం ప్రభుత్వం పై విమర్శలు చేసే సాహసం చేయడం లేదు. అమరావతి రాజధానిలో భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం పయ్యావుల కేశవ్ స్పందించారు. మిగిలిన అంశాలను ఆయన పట్టించుకోవడం లేదు.పయ్యావుల కేశవ్ కు తెలుగుదేశం పార్టీ మంచి విలువ ఇచ్చింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవిని చంద్రబాబు ఇచ్చారు. గట్టిగా వాయిస్ ను విన్పించి అధికార పార్టీని ఇరకాటంలో పెడతారనే చంద్రబాబు పయ్యావుల కేశవ్ కు ఆ పదవి ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు లాంటి నేతలు ఆ పదవిని కోరుకున్నా పయ్యావులనే చంద్రబాబు ఎంచుకున్నారు. కానీ రెండేళ్ల నుంచి ఆ పదవిలో ఉండి పయ్యావుల కేశవ్ చేసింది ఏమీ లేదు.దీంతో పీఏసీ ఛైర్మన్ పదవి నుంచి పయ్యావుల కేశవ్ ను తప్పించి మరొకరికి ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. పయ్యావుల కేశవ్ పార్టీని వీడతారన్న ప్రచారమూ ఇందుకు కారణం కావచ్చు. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, పీఏసీ ఛైర్మన్ గా సక్రమంగా బాధ్యతలను నిర్వర్తించకపోవడంతో ఆయన స్థానంలో వేరే వారిని నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts