YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఒప్పందాలు మర్చిపోయిన కేసీఆర్

ఒప్పందాలు మర్చిపోయిన కేసీఆర్

కర్నూలు
ఇంకా 10 సంవత్సరాలు హైదరాబాద్ లొనే ఉండి ఉంటే మనకు ఇబ్బంది ఉండేది కాదని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ వ్యాఖ్యనించారు. కేసీఆర్ కు కరోనా రావడం వలన మైండ్ పనిచేయడం లేదు. కేసీఆర్ ఒప్పందాలు అన్ని మర్చిపోయారు. కరోనా స్తే మన రాష్ట్ర ప్రజలను చెక్ పోస్ట్ ల దగ్గర నిలిపివేశారు. మాకు హైదరాబాద్ కు వచ్చే హక్కు ఉంది విభజన హామీలను మర్చిపోతే ఎలా..?  శ్రీశైలం పవర్ ప్రాజెక్టు అని మా ఇష్టం వచ్చినట్లు  పవర్ తయారు చేసుకుంటాం అని తెలంగాణ నాయకులు అనడం సిగ్గుచేటని అన్నారు. ఇరిగేషన్ కోసం నీళ్లు ఎందుకు వాడుకుంటున్నారో తెలంగాణ నాయకులు సమాధానం చెప్పాలి అన్నారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు కు నీరు రావాలి అంటే శ్రీశైలంలో  854 అడుగులు నేటి మట్టం ఉన్నప్పుడు ఉండాలి అన్నారు.  హుజురాబాద్ బై ఎలక్షన్ లో గెలవాలని కేసీఆర్ ఇలా నీటి గొడవలు మొదలు పెట్టారు. కేసీఆర్ నవరసాలు పండించే వ్యక్తి...  ఉగాది పచ్చడి లా తీపి చేదు లా ఆయన మాట తీరు ఉంటుంది. పోతిరెడ్డిపాడు, తెలుగు గంగ ప్రాజెక్టుల మీ ప్రాంత ప్రాజెక్టల కంటే ముందే కట్టారు..  మాకు  నీరు ఇచ్చిన తర్వాత నే తెలంగాణ కు నీళ్లు ఇవ్వాలని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టును మీ అదుపులోకి తీసుకోవడానికి పోలీసు బలగాలను పంపుతారా.. ఇది కరెక్ట్ కాదు.  దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర నాయకులు స్పందించాలని అన్నారు.

Related Posts