YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మళ్లీ ఇండియాలోకి టిక్ టాక్...

మళ్లీ  ఇండియాలోకి టిక్ టాక్...

న్యూ ఢిల్లీ జూలై 6
దేశంలో యూత్ ను ఒక ఊపు ఊపేసిన సామాజిక మాధ్యమం'టిక్ టాక్'.. గురించి తెలియని నెటిజన్ లేనే లేరు. షార్ట్ అండ్ స్వీట్ గా ముగిసిపోయే ఈ యాప్.. దాదాపుగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇక యువతరం గురించి చెప్పాల్సిన పనేలేదు. తమలోని టాలెంట్ ను చూపించడానికి సరైన వేదిక దొరికిందంటూ.. టిక్ టాక్ ను విపరీతంగా దున్నేశారు. వయసుతో పనిలేకుండా అందరూ టిక్ టాక్ లో సభ్యులైపోయారు.అయితే.. ఉన్నట్టుండి భారత ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. చైనాతో ఏర్పడిన సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ వస్తుందని భావించినా.. సాధ్యం కాలేదు. అయితే.. ఇప్పుడు టిక్ టాక్ ఫ్యాన్స్ కు సంతోషాన్నిచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. టిక్ టాక్ మళ్లీ ఇండియాలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక భారత్ విషయానికి వస్తే ఒకటి కన్నా ఎక్కువ కంపెనీలు పోటీ పడుతున్నారు. ఇండియా నుంచి ప్రస్తుతం వీడియో కంటెంట్ తో నెటిజన్లను ఆకర్షిస్తున్న ఓ కంపెనీతోపాటు షార్ట్ న్యూస్ అందించే మరో యాప్ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఓ ఫుడ్ అవుట్ లెట్ తోపాటు మొత్తం 12 కంపెనీలు రేసులో నిలిచినట్టు తెలుస్తోంది.అయితే.. ఇక్కడే కీలక విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. టిక్ టాక్ అనేది చైనా కంపెనీ కంపెనీ కాబట్టి.. కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. మరి వేరే కంపెనీ దీన్ని కొనుగోలు చేసినప్పుడు దేశం మారిపోతుంది. పేరు కూడా మారొచ్చు. అప్పుడు భారత ప్రభుత్వం దీన్ని అనుమతిస్తుందా? అన్నది తేలాలి. ఓకే అయితే మాత్రం.. మరోసారి టిక్ టాక్ వీడియోలు రచ్చ చేస్తాయని వేరే చెప్పక్కర్లేదు.

Related Posts