YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ వి పగటి కలలు : ఎమ్మెల్సీ రాములు నాయక్

కాంగ్రెస్ వి పగటి కలలు : ఎమ్మెల్సీ రాములు నాయక్

కాంగ్రెస్ పార్టీ కి గిరిజన డిక్లరేషన్ విడుదల చేసే నైతిక హక్కు లేదు. కామారెడ్డి లో సభ నిర్వహించి గిరిజనులకు ఎనిమిది హామీల తో ఉత్తమ్ డిక్లరేషన్ విడుదల చేయడం హాస్యాస్పదం. .కాంగ్రెస్ తీరు ను చూసి గిరిజనులు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ రాములు నాయక్ విమర్శించారు. బుధవారం నాడు అయన తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతం లో కాంగ్రెస్ అధికారం లో లేనట్టు, తెరాస యే మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు ఉంది కాంగ్రెస్ తీరని అయన అన్నారు. ఇన్నేళ్లు గిరిజనులను వంచించిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం లోనూ అదే తీరు కొనసాగిస్తోంది. అబద్దాల తో ఉత్తమ్ గిరిజనులను మభ్య పెడుతున్నారు. జిల్లాకో ట్రైబల్ యూనివర్సిటీ అంటూ ఉత్తమ్ ఆచరణ సాధ్యం కానీ హామీలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ అధికారం లో ఉండగా ఇపుడు ప్రకటించిన గిరిజన డిక్లరేషన్ ను ఎందుకు అమలు చేయలేకపోయారని అయన ప్రశ్నించారు. గిరిజనులు కాంగ్రెస్ ను నమ్మేoదుకు అమాయకులు కారు. తండాలను గ్రామ పంచాయతీలను చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ని గిరిజనులు నమ్ముతారా ? అని  నిలదీసారు. తెరాస ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది. ఒక్క గిరిజనుడు కూడా కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో ఓటు వేయడు. .తెలంగాణ లో నిశ్శబ్ద విప్లవం ఉందని ఉత్తమ్ అంటున్నారు. .తెలంగాణ లో నిశ్శబ్ద విప్లవం లేదు కదా గాంధీ భవన్ లో నిశ్శబ్ద విప్లవం ప్రారంభమయ్యిందని అయన అన్నారు. .ఉత్తమ్ ని పీసీసి అధ్యక్ష పదవి నుంచి ఎలా దించాలని అక్కడ నిశ్శబ్ద విప్లవం సాగుతోందనే విషయం ఉత్తమ్ గ్రహించాలని రాములు నాయక్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ పరిస్థితి యూపీ లాగా మారడం ఖాయం. వచ్చే ఎన్నికల తర్వాత గాంధీ భవన్ కు తాళం పడటం ఖాయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తెరాస దే అధికారం. కాంగ్రెస్ వాళ్ళు పగటి కలలు మానాలని అయన అన్నారు.

Related Posts