న్యూఢిల్లీ జూలై 6
దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు జూన్ నెలలో 92,849 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది. ఈ ఏడాది జూన్ 5వ తేదీ నుంచి జూలై 5వ వరకు ఆ మొత్తం జీఎస్టీగా వసూలైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాస్తవానికి ఇటీవల ప్రతి నెల లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూల్ అయ్యేది. క ఆనీ ఇటీవల పన్నుదారులకు కొన్ని రాయితీలు ప్రకటించడం వల్ల ఈ నెలలో జీఎస్టీ వసూళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని రిలీఫ్ చర్యలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాదితో పోలిస్తే జూన్ నెలలో ఈసారి రెండు శాతం వసూళ్లు పెరిగినట్లు ప్రభుత్వం చెప్పింది. గత 8 నెలల నుంచి జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటాయి. కానీ ఈ ఏడాది జూన్‌లో తక్కువ సంఖ్యలో వసూళ్లు జరిగాయి. మే నెలలో ఎక్కువ శాతం రాష్ట్రాలు లాక్‌డౌన్‌లో ఉన్న కారణంగా వసూళ్లు తగ్గినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. మే నెలలో 3.99 కోట్ల ఈ-బిల్లులు నమోదు అయినట్లు తెలిపారు. ఏప్రిల్ నెలలో 5.88 కోట్లు ఈబిల్ రూపంలో చెల్లించగా.. మేలో అది 30 శాతం తగ్గినట్లు తేలింది. కానీ మళ్లీ జూన్ నెలలో ఈ-బిల్లులు 5.5 కోట్లకు పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది.