YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జిల్లా ఇంచార్జులను ప్రకటించిన తెలంగాణ జన సమితి

జిల్లా ఇంచార్జులను ప్రకటించిన తెలంగాణ జన సమితి

టీజేసీ అధికార వికేంద్రీకరణ కోరుకుంటోందని ఆ పార్టీ అధ్యక్షులు కోదండరాం అన్నారు.  బుధవారం నాడు అయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజల భాగస్వామ్యం కోరుతున్నామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారు, ఆసక్తి గల వారు టీజేసీకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెండు రోజుల్లో దరఖాస్తు నమూనాను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. దివ్యాంగుల శాఖను, స్త్రీ, శిశు సంక్షేమశాఖ నుంచి వేరు చేయాలన్నారు. మహిళా విభాగాన్ని పటిష్టం చేసే క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.పార్టీ పటిష్టతపై దృష్టి సారించామని అయన కోదండరాం అన్నారు. తాత్కాలిక జిల్లా కమిటీలు వేశామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామన్నారు. ఖమ్మం జిల్లా ఇంచార్జ్గా ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, వరంగల్కు అంబటి శ్రీనివాస్, కరీంనగర్కు గాదె ఇన్నయ్య, వికారాబాద్కు శ్రీశైలం రెడ్డి, నిజామాబాద్కు గోపాల్ శర్మ, నల్గొండకు విద్యాధర్ రెడ్డి, సిద్ధిపేటకు బైరి రమేష్లను ఇన్చార్జ్లుగా నియమిస్తున్నట్లు తెలంగాణ జన సమితి ప్రకటించింది.

Related Posts