YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వివేకా కేసులో అవినాష్ పేరు...

వివేకా కేసులో అవినాష్ పేరు...

కడప, జూలై 7, 
కడ‌ప ఎంపీ మార్పు జ‌రుగుతుందా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా కొత్త మొహం వెలుగులోకి వ‌స్తుందా ? అంటే.. వైసీపీ నేత‌లే.. ఔన‌ని అంటున్నారు. అయితే దీనికి ఒక ష‌ర‌తు ఉంద‌ని చెబుతున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి అనూహ్య ప‌రిణామాలు జ‌రిగితేనే ఈ మార్పు ఉంటుంద‌ని అంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. క‌డ‌ప పార్ల‌మెంటు స్థానం నుంచి సీఎం వైఎస్ జ‌గ‌న్ క‌జిన్ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే వ‌రుస‌గా రెండుసార్లు ఆయ‌న క‌డ‌ప ఎంపీగా గెలుస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు ప్ర‌భుత్వం కూడా అధికారంలో ఉండ‌డంతోసీఎం క‌నుస‌న్న‌ల్లో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. నిత్యం పార్టీకి ట‌చ్‌లో ఉంటూ.. పార్ల‌మెంటులోనూ గ‌ట్టి గ‌ళం వినిపిస్తున్నారు. ప్ర‌భుత్వానికి అనుకూలంగా కేంద్ర మంత్రుల‌ను క‌లుస్తూ.. రాష్ట్ర ప్ర‌యోజనాల‌పైనా మాట్లాడుతున్నారు. ఇప్ప‌టికైతే.. ఎలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు కూడా అవినాష్‌కు అంట‌లేదు. ఇక‌, సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌రా ఆయ‌న‌కు మంచి మార్కులే ఉన్నాయి. మ‌రి ఇన్ని పాజిటివ్‌లు ఉన్న‌ప్పుడు అవినాష్‌ రెడ్డిని ఎందుకు ప‌క్క‌న పెడ‌తారు ? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఇక్క‌డే ఉంది.. అస‌లు విష‌యం. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో అవినాష్ రెడ్డి, ఆయ‌న తండ్రి పేర్లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.ప్ర‌స్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. ఇటీవ‌లే వివేకా కుమార్తె, ఆయ‌న స‌తీమ‌ణిల‌ను కూడా విచారించిన సీబీఐ అధికారులు కీల‌క విష‌యాల‌ను రాబ‌ట్టారు. ఈ క్రమంలో వారు గ‌తంలో పేర్కొన్న‌ట్టుగానే.. ఈ కేసులో అవినాష్‌, ఆయ‌న తండ్రి పాత్ర ఉంద‌ని.. ముందు వారిని విచారించాల‌ని.. కోరార‌ని.. తెలుస్తోంది. దీంతో కొద్దిరోజుల్లో అవినాష్‌ రెడ్డిని విచారించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఇక‌, ఈ కేసు విచార‌ణ పుంజుకుని.. వివేకా కుటుంబం ఆరోపించిన‌ట్టుగా సీబీఐ అధికారులు అవినాష్‌ రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకుంటే.. రాజకీయంగా వైసీపీలో పెను మార్పులు వ‌స్తాయ‌ని చెబుతున్నారు.ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల‌నాటికి అవినాష్‌ రెడ్డిని త‌ప్పిస్తార‌ని అంటున్నారు. వివేకా కేసు క‌నుక అవినాష్‌కు చుట్టుకుంటే.. ప్ర‌జ‌ల్లో సింప‌తీ పోయే ప‌రిస్థితి ఉంద‌ని.. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను త‌ప్పించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అయితే.. అదే స‌మ‌యంలో ఈ సీటును త‌న కుటుంబంలోని మ‌రో యువ నేత‌కు సీఎం జ‌గ‌న్ కేటాయిస్తార‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Related Posts