YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ కు ప్రత్యర్ధి దొరికినట్టేనా

కేసీఆర్ కు ప్రత్యర్ధి దొరికినట్టేనా

హైదరాబాద్, జూలై 7, 
యట శత్రువులు ఎపుడూ ప్రమాదకరం కాదు, లోపల ఉన్న వారే ఎపుడైనా దెబ్బ కొట్టగలరు. రాజుల కాలం నుంచి అంతపుర రాజాకీయాలు ఇదే చెబుతున్నాయి. ఎన్టీఆర్ కి రెండు సార్లు వెన్నుపోట్లు జరిగితే పొడిచిన వారు టీడీపీ వారే తప్ప కాంగ్రెస్ నుంచి ఎవరూ లేరు అన్నది గుర్తు పెట్టుకోవాలి. ఇక కేసీఆర్ విషయానికి వస్తే ఆయన పార్టీ ప్రభలు 2018 నాటికే బాగా కరిగిపోయాయి. ఆంధ్రా పెత్తనం అంటూ చంద్రబాబు బూచిని చూపించి కేసీఆర్ నాడు రెండవ సారి గెలవగలిగారు అన్నది ఒక విశ్లేషణ‌ ఉంది. ఇక అప్పట్లో మోడీ సర్కార్ కూడా ఆరు నెలల ముందు విడిగా ఎన్నికలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది అన్నది కూడా తెలిసిందే. అలా కాకుండా షెడ్యూల్డ్ ప్రకారం 2019 ఏప్రిల్ లో కనుక జమిలి ఎన్నికలలో టీయారెస్ పోటీ చేసి ఉంటే కచ్చితంగా ఓడిపోయి ఉండేది అన్నది బీజేపీ ఊపు, దానికి వచ్చిన సీట్లు చూస్తే తెలుస్తున్న విషయం. మొత్తం 17 ఎంపీ సీట్లకు గానూ టీయారెస్ కి దక్కింది కేవలం తొమ్మిది మాత్రమే. అంటే వాటిని ఎమ్మెల్యేలకు కన్వర్ట్ చేస్తే 63 సీట్లు దక్కేవన్న మాట. అయితే అసెంబ్లీ ఎన్నికలు అంటూ జరిగితే బీజేపీ ఢీ కొట్టే తీరు వేరుగా ఉండేది. అపుడు కచ్చితంగా టీయారెస్ కి ఆ 63 కాస్తా ఏ 43లో అవడం కూడా జరిగేది అన్నది అంతా చెప్పేమాట. ఇదంతా గతం అయితే ఇపుడు మరో మూడేళ్ళ కాలం గడచింది. ఈ మధ్యలో రెండు సార్లు కరోనా వచ్చి టీయారెస్ పాలనలోని డొల్లతనాన్ని బయటేసింది. అలాగే ఎన్నో ప్రజావ్యతిరేక నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఇక ఉద్యమ నేత అయిన ఈటల రాజేందర్ లాంటి వారిని బయటకు వెళ్ళగొట్టి కుటుంబ పాలనకు కేసీఆర్ తెర లేపాడన్నది కూడా ఈ రోజున అందరికీ తెలిసిపోయిన నేపధ్యం ఉంది.ఎంతైనా కేసీఆర్ తో చేసిన సావాసం కదా. అందుకే ఈటల రాజేందర్ కరెక్ట్ రూట్ లోనే ఇపుడు వెళ్తున్నారు అనుకోవాలి. ఆయన సొంతంగా పార్టీ పెడతారు. అలా ఓట్లు చీలి మళ్ళీ తమకే అధికారం అని టీయారెస్ వేసుకున్న అంచనాలను ఒక్క దెబ్బకు తుత్తినియలు చేశారు ఈటల. ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడం వెనక చాలా పెద్ద వ్యూహాలే ఉన్నాయి. కేసీఆర్ ని ఎదుర్కోవాలంటే అధికారంలో ఉండడమే అసలైన ఆయుధం అని ఆయన నమ్ముతున్నారు. అంతే కాదు, బీజేపీ వంటి పార్టీకి తెలంగాణాలో పాగా వేయాలని ఉంది. దాంతో కమలం కసి, తన పట్టుదల వెరసి గులాబీ తోటకు చెదలు పట్టించడం ఖాయమనే నమ్ముతున్నారు. వీలైనంతవరకూ టీయారెస్ వ్యతిరేక ఓట్లు చీలకుండా కూడా ఈటల రానున్న రోజుల్లో గట్టిగా ట్రై చేస్తారు అంటున్నారు.ఇది రాజకీయం. ఏదీ అసాధ్యం అంటూ లేదు. ఉక్కు మహిళ ఇందిరాగాంధీ, ప్రత్యక్ష దైవంగా నీరాజనాలను అందుకున్న ఎన్టీయార్ లే ఓడిపోయిన రాజకీయమిది. అందువల్ల వీరి కంటే కేసీఆర్ గొప్ప ఏమీ కాదు. కాకపోతే సమీకరణలు అన్నీ కుదరాలి. ఆ పని చేయడానికే ఈటల రెడీగా ఉన్నారు. విపక్షానికి కావాల్సినదేంటో అది ఈటల అందించగలరు, ఆయన ఇంధనంగా మారి గులాబీ తోటను మండించనూగలరు. నాడు పురాణాల్లో ఎక్కడ నీ దేవుడు అంటూ హిరణ్య కశిపుడు ప్రహ్లాదుడిని అడుగుతూ తన ప్రాణాలు తీసే శత్రువునేఎదురు తెచ్చుకున్నాడు. ఇపుడు కేసీఆర్ కూడా ఈటలను బయటకు పంపించి టీయారెస్ కి తొలి ఓటమికి అవసరమైన పూర్వ రంగాన్ని సిద్ధం చేయిస్తున్నారా అన్న డౌట్లు ఆ పార్టీలోనే ఉన్నాయి. రెండు సార్లు అధికారంతో పూర్తిగా యాంటీ ఇంకబెన్సీ వచ్చిన వేళ 2023 చివరల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు టీయారెస్ కి అగ్ని పరీక్ష కాబోతున్నాయి అన్నది సత్యం. ఈటల తన వామపక్ష సిద్ధాంతాలు అన్నీ కూడా పక్కన పెట్టి కమలం నీడన చేరడానికి కారణం కేసీఆర్ ని గద్దె దించడం కోసమే. అందువల్ల అన్ని వైపులా ఎదురుగాలి వీచే వేళ టీయారెస్ వంటి పార్టీని గద్దె దిగడం అన్నది సుసాధ్యమే అవుతుందేమో చూడాలి.

Related Posts