YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జూలై 8న ఏపి రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవం

జూలై 8న ఏపి రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవం

అమరావతి జూలై 7
 రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజున చేపట్టే కార్యక్రమాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని పండుగలా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులిచ్చారు.
రైతు దినోత్సవ కార్యక్రమాలివే..
►రూ.413.76 కోట్లతో నిర్మించిన 1,898 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, రూ.79.50 కోట్లతో నిర్మించిన 65 వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లు, 8 ఆక్వా ల్యాబ్‌లు, 25 సీఏడీడీఎల్‌లను ప్రారంభిస్తారు.
►సన్న, చిన్నకారు రైతులకు సాగు యంత్రాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఆర్‌బీకేలకు అనుబంధంగా రూ.96.64 కోట్లతో 611 వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాల (సీహెచ్‌సీల)తో పాటు పాడి రైతుల కోసం ప్రత్యేకంగా 34 సీహెచ్‌సీలను ప్రారంభిస్తారు.  
►రూ.31.74 కోట్లతో నిర్మించిన 53 కొత్త వెటర్నరీ హాస్పిటల్స్, డిస్పెన్సరీలు, రూరల్‌ లైవ్‌ స్టాక్‌ యూనిట్లతో పాటు విశాఖపట్నంలోని స్మైల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్, రూ.7.53 కోట్లతో విజయవాడలో పాడి రైతుల కోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు.
►ఆర్‌బీకేల ద్వారా పాడి రైతులకు 75 శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు, 60 శాతం సబ్సిడీతో టీఎంఆర్‌ బ్లాక్స్, 50 శాతం సబ్సిడీపై మినరల్‌ మిక్చర్, చాప్‌ కట్టర్స్‌ పంపిణీకి శ్రీకారం.
►రూ.400.30 కోట్లతో ఆర్‌బీకేల స్థాయిలో నిర్మించతలపెట్టిన 1,262 గోడౌన్లకు, రూ.200.17 కోట్లతో కోత అనంతర మౌలిక సదుపాయాల కల్పనకు, మార్కెట్‌ యార్డుల్లో రూ.212.31 కోట్లతో ఆధునికీకరణ, అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు, రూ.45 కోట్లతో 45 కొత్త రైతు బజార్లకు శంకుస్థాపనలు చేస్తారు. రూ.3 కోట్లతో ఏర్పాటు చేస్తున్న 6 రైతు బజార్లను ప్రారంభిస్తారు.
►రూ.15 కోట్లతో నాబార్డు సీబీఎస్‌ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన ఆప్కాబ్‌ 13, డీసీసీబీ 24 బ్రాంచ్‌లకు శ్రీకారం చుడతారు.
►రాష్ట్ర స్థాయిలో 13 మందిని రూ.2.5 లక్షలు, జిల్లా స్థాయిలో నలుగుర్ని  రూ.25 వేలు, మండల స్థాయిలో నలుగుర్ని రూ.5 వేల నగదు ప్రోత్సాహకాలతో సత్కరిస్తారు.  

Related Posts