టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంఅయింది. బుధవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్ సెల్లో జరుగుతున్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఏపీకి హోదా, విభజన హామీల అమలు పోరాటంపై సమీక్షతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న టీడిపి సమన్వయ కమిటీ సమావేశ0, మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు పాల్గోన్నారు. అలాగే, జిల్లా పార్టీల అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాటల్ఆడుతూ తిరుపతిలో ధర్మపోరాటం సభ విజయవంతం అయ్యిందన్నారు. తిరుపతి సభ విజయవంతం చేసిన అందరికీ అభినందనలు తెలిపారు. తిరుపతి సభకు తరలివచ్చిన జనమే టిడిపి పట్ల ప్రజాదరణకు నిదర్శనం. రుపతిలో అడుగుపెట్టగానే సంతోషం వేసింది. ఎయిర్ పోర్టు నుంచి ప్రధాన రహదారులన్నీ సుందరీకరణ చేశామని అన్నారు. సుద్దమట్టిలో సుందరీకరణ గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. నమ్మకద్రోహం-కుట్ర రాజకీయాలపై మరో పన్నెండు ధర్మపోరాట సభలు నిర్వహిస్తాం. తరువాత సభ విశాఖపట్నంలో..చివరి సభ అమరావతిలో నిర్వహిస్తామని అయన అన్నారు. ప్రజల్లో సంతృప్తి మార్చిలో 67% వస్తే, ఏప్రిల్ లో 73% వచ్చింది. మన అభివృద్ధి,హక్కుల కోసం పోరాటం వల్లే సంతృప్తి పెరిగిందన్నారు. ప్రభుత్వంపై సానుకూలత ఉంది, పార్టీపై కూడా అంతమేర సానుకూలత ఉండాలి. ప్రతి నియోజకవర్గంలో సానుకూలత పెరిగేలా చూడాలి. ఐక్యంగా ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి ఒకే మాట మీద నిలబడాలి, ఒకే బాటలో నడవాలి,అన్ని నియోజకవర్గాలలో మనం గెలవాలని అయన సూచించారు. మీ తప్పులను నా మీద వేసుకోవడానికి సిద్ధంగా లేను. మన ప్రతి చర్యకు ప్రజల్లో ప్రతిచర్య ఉంటుంది. ఎక్కడా తప్పు జరగరాదు, అనర్హులు ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాల లబ్దిచేకూరరాదు. మాటల్లో కాదు,చేతల్లో చూపిస్తున్నాం. దీనిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 40ఏళ్లలో ఎప్పుడూ చేయని పనులు ఈ నాలుగేళ్లలో చేశానన్న సంతృప్తి ఉందని చంద్రబాబు అన్నారు. డబ్బులు లేని సమయంలో పోలవరాన్ని పరుగులు తీయిస్తున్నాం. డబ్బులు లేకున్నా రైతుల తోడ్పాటుతో రాజధానిని నిర్మిస్తున్నాం. మననిధులు సమర్ధంగా వినియోగించాం, ప్రాధాన్యతలు నిర్ణయించాం. కన్వర్జెన్స్ తెచ్చాం. జవాబుదారీతనం పెంచాం. ఈ రాజధాని ఎవరికోసం అని అసూయాపరులు ప్రశ్నిస్తున్నారని అయన వ్యాఖ్యానించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు పై చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. మన ప్రభుత్వంలో అత్యున్నత పదవులు పొందినవారు పుస్తకాలు రాస్తున్నారు. అసూయా ద్వేషాలతో దుష్ప్రచారం చేస్తున్నారని అయన ఆరోపించారు.తిరుపతి సభరోజే విశాఖలో వంచనదినం పెట్టడం వెనుక అజెండా ఏమిటని అయన వైకాపాపై ధ్వజమెత్తారు. హోదా ఇవ్వని బిజెపిని విమర్శించరా..? హోదాకోసం పోరాడుతున్న టిడిపిని విమర్శిస్తారా..? దీని వెనుక రహస్య అజెండా ఏమిటని ప్రశ్నించారు. ఏపిలో ఈడి అటాచ్ మెంట్లు సడలిస్తున్నారు. కర్ణాటకలో మైనింగ్ కేసులు తొలగిస్తున్నారు. ఇదేనా అవినీతిపై బిజెపి పోరాటం. కుడి,ఎడమ అవినీతిపరులను పెట్టుకుని ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారని నిలదీసారు. లాలూచీ రాజకీయాలకు కర్ణాటక ఎన్నికలే కేస్ స్టడీ. ఎన్నికలకు ముందు స్విస్ బ్యాంకులో డబ్బులు తెచ్చి పంచుతామన్నారని అయన విమర్శించారు.