YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆటలు తెలంగాణ

క్రీడలకు ప్రోత్సహాలు మంత్రి శ్రీనివాస్ గౌడ్

క్రీడలకు ప్రోత్సహాలు మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్  హైదరాబాద్ లోని గచ్చిబౌలి మినీ స్టేడియంలో  టోక్యో ఒలంపిక్స్ కు మన దేశం నుండి ఎంపికైన  రాష్ట్రానికి చెందిన క్రీడాకారులను, శిక్షకులను  ఘనంగా సన్మానించారు. టోక్యో ఒలంపిక్స్ కు మన రాష్ట్రం నుండి దేశానికి బ్యాడ్మింటన్ లో పీవీ సింధు, సాయి ప్రణీత్, చిరగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, కోచ్ లు గోపిచంద్, ఇస్మాయిల్ బైగ్, ఎన్   రమేష్, అగుస్ (ఇండోనేషియా) పర్కా సాయి ( కొరియన్) మేథ యాస్ భో (డెన్మార్క్ ) , టెన్నిస్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న సానియా మీర్జా తరుపున ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్  రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి, క్రీడా సదుపాయాల కల్పనకు అనేక ప్రోత్సాహకాలను ప్రకటించారన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాల నిర్మాణం కోసం 46.85 కోట్ల రూపాయల ను,   23. 84 కోట్ల రూపాయల ను,   క్రీడాకారులకు 25 కోట్ల 87 లక్షల రూపాయలను నగదు ప్రోత్సాహకాలను అందించామన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల అభివృద్ధి కోసం 9.05 కోట్ల రూపాయలను, కరీంనగర్, ఆదిలాబాద్, క్రీడా అకాడమీ లు వరంగల్, సైక్లింగ్ వెళ్లొడ్రమ్, ఖమ్మం, వనపర్తి, సరూర్ నగర్, మహబూబ్ నగర్ లలో ఏర్పాటు చేస్తున్న అకాడమీ లకు 14.21 కోట్ల రూపాయల ను, వివిధ క్రీడా సంఘాలకు 9 కోట్ల రూపాయల ను, క్రీడా పోటీల నిర్వహణకు 20 కోట్ల  అందించి క్రీడలను ప్రోత్సహిస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ను క్రీడా హబ్ గా తీర్చిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్  క్రీడా పాలసీ తయారీకి, క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ని  నియమించారన్నారు. వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్  సహకారంతో పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీల సీఎస్సార్ ఫండ్స్ ద్వారా వివిధ క్రీడల అభివృద్ధి కి కృషి చేస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడాకారులకు ఉన్నత విద్యా లో 0.5 శాతం, ఉద్యోగాలలో రెండు శాతం రిజర్వేషన్లు ను అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు.  ఒలంపిక్స్, ప్రపంచ ఛాంపియన్స్ షిప్ లలో, కామన్ వెల్త్ లాంటి అంతర్జాతీయ స్థాయి వేడుకల్లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్నీ గతం కంటే ఎక్కువగా అందిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో ఒలంపిక్స్ లో గోల్డ్ సాధించిన క్రీడాకారునికి 50 లక్షలు ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2 కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని అందజేస్తున్నామన్నారు, రజత పథకం సాధించిన క్రీడాకారులకు గతంలో 25 లక్షల రూపాయలు ఇస్తే నేడు ఒక కోటి రూపాయల ను అందిస్తున్నామన్నారు. కాంస్య పతకం సాధించిన క్రీడాకారులకు గతంలో 10 లక్షలు ఇస్తే నేడు 50 లక్షల రూపాయల నగదు  పురస్కారాలను క్రీడాకారులకు సీఎం కేసీఆర్  ఆదేశాల మేరకు అందిస్తున్నామన్నారు మంత్రి. టోక్యో ఒలంపిక్స్ లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనబర్చి పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి క్రీడాకారులకు మంత్రి  పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి,  బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ  సింధు తో సరదాగా బ్యాడ్మింటన్ ఆడి ప్రోత్సాహించారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజు, స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి సుజాత, నర్సయ్య, వెంకయ్య, ధనలక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.

Related Posts