YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కేంద్రకేబినెట్ విస్తరణ 81 మందికి ... కొత్తగా 43 మంది ప్రమాణ స్వీకారం

కేంద్రకేబినెట్ విస్తరణ 81 మందికి ... కొత్తగా 43 మంది ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ, జూలై 7,
2019 మేలో రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన క్యాబినెట్‌ను భారీగా విస్తరించారు. 2024లో కూడా  అధికార పీఠం లక్క్ష్యంగా పలు సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని మంత్రుల మండలి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూండటంతో పాటు  యువ రక్తానికి ప్రాధాన్యత ఇచ్చారుకేంద్ర కేబినెట్‌లో కొత్తగా 43 మందికి అవకాశం కల్పించారు. ఈ మేరకు ప్రధాని ఆహ్వానం అందుకున్న నేతలు  ఆయన నివాసానికి చేరుకున్నారు. కేబినెట్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న వారి జాబితాలో జ్యోతిరాదిత్య సింధియా, సర్బానంద సోనోవాల్‌, నారాయణ్‌ రాణే, భూపేంద్ర యాదవ్‌, ఆర్‌.పి.సింగ్‌, అనుప్రియ పటేల్‌, పశుపతి పరాస్‌, అనురాగ్‌ ఠాకూర్‌, పురుషోత్తం రూపాల, కిషన్‌రెడ్డి,  కపిల్‌ పాటిల్‌, మీనాక్షి లేఖి, అశ్వినీ వైష్ణవ్‌, శాంతను ఠాకూర్, పంకజ్‌ చౌదరి, దిలేశ్వర్‌ కామత్‌, రాహుల్‌ కాస్వా‌, వినోద్‌ సోంకర్‌, చందేశ్వర్‌ ప్రసాద్‌, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, రాజ్‌కుమార్‌ రంజన్‌సింగ్‌, అజయ్‌ మిశ్ర, బీఎల్‌ వర్మ, అజయ్‌ భట్‌, శోభా కరంద్లాజే  ఉన్నారు. కేంద్ర కేబినెట్‌లో 12 మంది ఎస్సీలకు చోటు దక్కింది. వీరిలో ఇద్దరికి కేబినెట్‌ హోదా లభించే అవకాశం. అలాగే 8 మంది ఎస్టీలకు  చాన్స్‌ దక్కనుండగా, వీరిలో ముగ్గురికి కేబినెట్‌ హోదా కల్పించారు. ఇక బీసీల విషయానికి వస్తే  27 మంది ఓబీసీలకు చోటు దక్కనుంది. వీరిలో ఐదుగురికి కేబినెట్‌ హోదా లభించనుంది. వీరితో పాటు ఐదుగురు మైనారిటీ మంత్రులకు ఛాన్స్‌ లభించనుంది.  ముగ్గురికి కేబినెట్‌ హోదా దక్కనుంది. వీరితోపాటు ముస్లిం, సిక్కు, క్రిస్టియన్‌, బౌద్ధులకు ఒక‍్కొక్కరు చొప్పున సమానం ప్రాతినిధ్యం ఇచ్చినట్లైంది. భారీగా విస్తరించిన మోదీ కొత్త కేబినెట్‌లో 11 మంది మహిళలకు మంత్రులుగా అవకాశం లభించనుందని అంచనా. ముఖ్యంగా ఇద్దరికి కేబినెట్‌ హోదా కల్పించ నున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనంతరం, రాష్ట్రపతి భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుంది. కేంద్రమంత్రుల సగటు వయసు 58 సంవత్సరాలు కాగా 50 ఏళ్ల లోపు వయసు ఉన్న మంత్రులు 14 మంది ఉండగా, 50 ఏళ్ల లోపు వయసు ఉన్నవారిలో ఆరుగురికి కేబినెట్‌ ర్యాంక్‌ ఉంది. కేబినెట్ లో విద్య కూడా ప్ర‌ధాని ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు. కొత్త క్యాబినెట్‌లో 13 మంది లాయ‌ర్లు ఉడ‌నున్నారు. ఆరుగురు డాక్ట‌ర్లు, అయిదుగురు ఇంజినీర్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో ఏడు మంది మాజీ ఐఏఎస్‌లు ఉంటారు. ఇవాళ ప్ర‌మాణం చేయ‌నున్న 43 మందిలో 31 మంది ఉన్నత విద్య‌ను అభ్య‌సించిన‌వారే. అయితే కొత్త క్యాబినెట్ స‌గ‌టు వ‌య‌సు 58 ఏళ్లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 14 మంది మంత్రులు వ‌య‌సు 50 క‌న్నా త‌క్కువే ఉండ‌నున్న‌ది. 11 మంది మ‌హిళా మంత్రుల‌కు కూడా అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక వ‌ర్గానికి చెందిన అయిదుగురికి క్యాబినెట్ హోదా ద‌క్క‌నున్న‌ది. ఒక‌రు ముస్లిం, ఒక‌రు సిక్కు, ఒక‌రు క్రిస్టియ‌న్‌, ఇద్ద‌రు బౌద్ద మ‌త‌స్తులు ఉండ‌నున్నారు. ఓబీసీ వ‌ర్గానికి చెందిన వారు 27 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంట్లో అయిదుగురికి క్యాబినెట్ హోదా ద‌క్కుతుంది. 8 మంది ఎస్టీల‌ను రిక్రూట్ చేయ‌నున్నారు. దీంట్లో ముగ్గురికి క్యాబినెట్ హోదా ద‌క్కుతుంది. గోండు, సంత‌ల్‌, మిజీ, ముండా, టీ ట్రైబ్‌, కొంక‌నా, సోనావాల్ తెగ‌ల‌వారుంటారు
టార్గెట్ యూపీ
బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏసర్కార్‌ తాజా  కేబినెట్‌ విస్తరణ  తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ఇటీవలి అయిదు  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తగిన ఎదురు దెబ్బ నేపథ్యంలో  తన మంత్రి వర్గాన్ని భారీగా విస్తరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొగ్గు చూపారు. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఒక సంవత్సరమే సమయం ఉండటంతో అటు కుల, ఇటు మిత్ర పక్షాలను సంతృప్తిపరచేలా  వివిధ సమీకరణాలను మోదీ పరిశీలించినట్టు తెలుస్తోంది. 2022లో రానున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, ఈ రోజు కేంద్ర కేబినెట్‌లో చేరే అవకాశం ఉన్న యూపీకి చెందిన అభ్యర్థులను పరిశీలిస్తే వరుణ్ గాంధీ, అనుప్రియా పటేల్, రీటా బహుగుణ జోషిలను మోదీ కొత్త మంత్రివర్గంలో చోటు కల్పించారు
అనుప్రియా పటేల్
అప్నా దళ్ (సోనెలాల్) అధ్యక్షుడు అనుప్రియా పటేల్‌ను కేంద్ర మంత్రివర్గంలో చేరారు  యూపీ అసెంబ్లీలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ కేబినెట్ విస్తరణలో అప్నా దళ్ (సోనెలాల్) కోటా 2019 ఆగస్టులో పెరగలేదు.  అనుప్రియా పటేల్ తన పార్టీ నుండి ఇద్దరు మంత్రులకు బెర్తులు పొందాలని భావించారు  ఈ నేపథ్యంలో వారిని బుజ‍్జగించే  క్రమంలో అనుప్రియకు అవకాశం రానుంది.
వరుణ్ గాంధీ
వచ్చే ఏడాది యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం రానుందని భావిస్తున్న కేంద్ర మాజీమంత్రి మేనకాగాంధీ కుమారుడు, వరుణ్ గాంధీకి అనూహ్యంగా మోదీ కేబినెట్‌లో ఛాన్స్‌ దక్కింది. ఇప్పటిదాకా దూకుడు నాయకుడిగా పేరొందిన వరుణ్‌గాంధీని పక్కన పెట్టిన మోదీ ఇపుడిక అవకాశాన్నివ్వనున్నారు. అయితే ముఖ్యంగా  యూపీలో  పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ వాద్రాకు, గాంధీ కుటుంబానికి చెక్‌ పెట్టేలా వరుణ్ గాంధీని రంగంలోకి దింపనుంది.
రీటా బహుగుణ జోషి
అలహాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ, ప్రొఫెసర్ రీటా బహుగుణ జోషి కూడా కేంద్ర మంత్రివర్గం రేసులో ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ తొలి మంత్రివర్గంలో పర్యాటక రంగంతో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి. బలమైన మహిళా బ్రాహ్మణ నాయకురాలిగా, విద్యావేత్తగా, రీటా బహుగుణ కీలకంగా ఉన్నారు.
అజయ్ మిశ్రా
ఉత్తరప్రదేశ్‌లోని బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించడానికి లఖింపూర్ ఖేరి ఎంపి అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రివర్గంలో  చేర్చుకునే అవకాశం ఉంది. తద్వారా మోదీ  2.0 క్యాబినెట్‌లోకి  యువ ముఖానికి అవకాశం ఇచ్చే సందేశాన్నివ్వనుంది.
రామ్ శంకర్ కాథెరియా
దళిత ఓటర్లను ఆకర్షించే బీజేపీ వ్యూహంలో భాగంగా  దళిత నాయకుడు, ఎటావా ఎంపి రామ్ శంకర్ కాథెరియాకు అవకాశం దక్కనుంది.  షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ మాజీ ఛైర్మన్. ఇంతకుముందు ఆగ్రా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన  కాథెరియా, మోదీ తొలి  కేబినేట్‌లో కూడా  చోటు దక్కించుకున్నారు.

Related Posts