బెంగాల్, జూలై 7,
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు షాకిచ్చింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమత దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు ఆమెకు రూ.5లక్షల జరిమానా విధించింది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌషిక్ చందాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తూ మమత గతంలో దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు... న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారంటూ తీవ్రంగా హెచ్చరించింది. మమతా బెనర్జీ దాఖలు చేసిన దరఖాస్తును జస్టిస్ కౌషిక్ చందా స్వయంగా తిరస్కరించారు. తాను వ్యక్తిగత అభీష్టానుసారం కేసు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని చెపుతూ కేసును తన బెంచ్ నుంచి విడుదల చేశారు. నందిగ్రామ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమతాబెనర్జీ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపులోనూ అక్రమాలు జరిగాయని, కావున సువేందు ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కోల్ కతా హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ పిటిషన్ ను జస్టిస్ కౌశిక్ చందా విచారణ చేపట్టారు. ఈ పిటిషన్ ప్రజా ప్రాతినిధ్యం చట్టం-1951కి అనుగుణంగా వేశారా? లేదా? అనే విషయమై ఓ నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ కు జడ్జి కౌశిక్ ఆదేశాలు కోరారు. ఈ నేపథ్యంలోనే మమతా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తన కేసును ఆ జడ్జిని తన కేసు విచారించకుండా చూడాలని, ఆయనకు బీజేపీ నేపథ్యం ఉందని చీఫ్ జస్టిస్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.