విశాఖ లో వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పాదయాత్ర ప్రారంభిం చారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై అద్యయనం చేస్తూ కొనసాగుతున్న జగన్ పాదయాత్ర తరహాలో విశాఖ రైల్వే జోన్ సాధన కోసం విజయసాయి రెడ్డి పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం నాడు మద్దిలపాలెం నుంచి బైక్ యాత్ర ను చేపట్టారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు జిల్లా సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పాదయాత్ర చేపట్టినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ అధినేత ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావ యాత్ర చేయాలని నిర్ణయించినట్లు అయన అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ,ఆంధ్ర రాష్ట్రానికి సుపరిపాలన కోసం అధినేత జగన్ నవరత్నాలు ప్రకటించారని , ఉత్తరాంధ్ర కు సుజల స్రవంతి సాకారం చెయ్యడంతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు 12 రోజులపాటు పాద యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ గా సంపత్ వినాయక ఆలయానికి చేరుకొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ వీరభద్ర స్వామీ, పార్టీ కార్యకర్తలు పాల్గోన్నారు.