YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇంటి నుంచే ఉద్యమం ప్రారంభిస్తాం : పవన్ వార్నింగ్

ఇంటి నుంచే ఉద్యమం ప్రారంభిస్తాం : పవన్ వార్నింగ్

విజయవాడ, జూతై 7, 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ముఖ్యమంత్రి జగన్ భద్రత పేరుతో ఆయన ఇంటికి సమీపంలో ఉన్న ఇళ్లను ఖాళీ‌ చేయిస్తారా అంటూ మండిపడ్డారు. ఆడపడుచులను పచ్చి బూతులను తిడతారా అని పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నాయకులు ఉంటే.. ఆడబిడ్డలపై ‌మానభంగాలు ఆగుతాయా అని ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ముఖ్యమంత్రి జగన్ ఇంటి ముందే ఉద్యమం చేపడతామని సంచలన ప్రకటన చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం తనను కలిసిన తాడేపల్లి కరకట్ట వాసులకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తమ కష్టాలను, సమస్యలను పవన్‌కు తెలియజేశారు.సీఎం జగన్మోహన్ రెడ్డి ‌నివాసం‌ చుట్టూ ఉన్నవారిని ఖాళీ‌ చేయాలని నోటీసులు ఇచ్చారని, ముందు స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా ఖాళీ‌ చేయాలని బెదిరిస్తున్నారని బాధితులు పవన్ కళ్యాణ్ ముందు వాపోయారు. అర్ధరాత్రి ఇళ్ల మీదకు ప్రొక్లెయినర్లను పంపిస్తున్నారని, అదేమని అడిగితే చెప్పలేని విధంగా బూతులు తిట్టి‌ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా ఉంటున్న తమకు కనీసం గూడు లేకుండా చేస్తున్నారని తెలిపారు. తమకు అండగా నిలబడి ఉద్యమం చేయాలని పవన్‌కు బాధితులు విజ్ఞప్తి చేశారు.సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సీఎం ఇంటి‌ చుట్టూ ఉన్నవారికే రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. 35 ఏళ్లుగా ఉన్న వారికి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. భయపెట్టి, బెదిరిద్దాం అనుకుంటే ప్రజలు భయపడబోరని పవన్ హెచ్చరించారు. ఒకవేళ ఖాళీ చేయించడం తప్పని సరైతే... బాధితులకు ముందు న్యాయం చేయాలన్నారు. 350 కుటుంబాలకు ముందు ఇళ్లు ఇచ్చాకే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని తేల్చి చెప్పారు. ఒకవేళ ముఖ్యమంత్రి జగన్ మొండిగా ముందుకెళితే... జనసేన తరఫున సీఎం నివాసం వద్దే ఉద్యమిస్తామని పవన్ తీవ్రంగా హెచ్చరించారు.

Related Posts